ప్రేక్షకులకు చూడగానే చిర్రెత్తుకచ్చిన హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ఇవే !
TeluguStop.com
ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే సినిమా కథ, కథనం, పాటలు, డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ చాలా ప్రధానం.
మన టాలీవుడ్ లో కామెడీ, యాక్షన్, రివెంజ్, లవ్ అనే తేడా లేకుండా, ప్రతి సినిమాలో లవ్ ట్రాక్ ఖచ్చితంగా ఉంది తీరుతుంది.
కొన్ని జోడీలు చూస్తే వాళ్లిద్దరూ నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఫీలింగ్ వస్తుంది.
కానీ మరి కొన్ని జోడీలు చూస్తే అస్సలు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది.అటువంటి చిత్రాలు, కథలు బాగున్నప్పటికీ, ఆ కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడానికి ఇబ్బందిపడతారు.
అందుకే కొన్ని చిత్రాలు కేవలం హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ లేక ప్లాప్ అవుతూ ఉంటాయి.
వెండితెర పై చూడడానికి కాస్త డిఫరెంట్ గా అనిపించినా కొన్ని జోడీలు ఇప్ప్డుడు చూద్దాం.
1.ఈ జాబితాలో మొదట నిలిచేది చిరంజీవి, త్రిషల( Chiranjeevi, Trisha ) జోడి.
వీరిద్దరూ కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథ పరంగా చాలా బాగున్నప్పటికీ, చిరంజీవి, త్రిషల లవ్ ట్రాక్ కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.
"""/" /
2.ఆ తూరువాత ఈ మధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ పై అస్సలు సెట్ అవ్వని జోడి ఏది అంటే అది, మహేష్ బాబు రష్మిక( Mahesh Babu, Rashmika ) ల జోడి.
వీరిద్దరూ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించారు.
ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ, ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ అస్సలు సెట్ అవ్వలేదు.
"""/" /
3.వెంకటేష్, నాగ చైతన్య( Venkatesh, Naga Chaitanya ) కలిసి చేసిన మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మామ.
ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజపుట్ నటించింది.వీళ్ళ జోడి కూడా అట్టర్ ప్లాప్ అనే చెప్పాలి.
వీళ్లిద్దరి మధ్య తెరకెక్కించిన లవ్ ట్రాక్ సినిమా కు పెద్ద మైనస్. """/" /
4.
తమిళ హీరో విక్రమ్, కీర్తి సురేష్( Vikram, Keerthy Suresh ) జంట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది.
వీళ్లిద్దరు కలిసి నటించిన చిత్రం సామి స్క్వేర్.అప్పట్లో సామి గా విడుదలయ్యి సూపర్ హిట్ అయినా చిత్రానికి ఇది సీక్వెల్.
కానీ ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది. """/" /
5.
మిస్టర్ మజ్ను చిత్రం లో అఖిల్ ( Akhil )తో కలిసి జంటగా నటించింది బాలీవుడ్ భామ నిధి అగర్వాల్( Nidhi Agarwal ).
ఇది పక్కా లవ్ స్టోరీ.ఐతే ఈ చిత్రంలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు.
"""/" /
6.గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన చిత్రం వరుడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
దీనికి ముఖ్య కారణం హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వకపోవడమే.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?