సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడని 10 హీరోయిన్స్ వీళ్ళే

ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం.

హీరోయిన్ అందాలు, ఆమె కోసం హీరో పడుతున్న బాధలు ఇలా ఎన్నెన్నో కధలను మనం చూసాం.

అయితే సినిమాలో హీరో ఎలా ఉన్నాగాని హీరోయిన్ మాత్రం చూడ్డానికి అందంగా, అప్సరలా ఉండాలని ఒక ప్రేక్షకుడు కోరుకుంటాడు.

సినిమా ప్రొడ్యూసర్స్ కూడా హీరోయిన్ గ్లామర్ చూసే అవకాశాలు ఇస్తారు.అందుకే హీరోయిన్లు కూడా వారి అందాల ఆరబోతలో వెనకడుగు వేయకుండా ఉంటారు.

అయితే ఇటీవల కొంతమంది హీరోయిన్లు అలాంటి స్టీరియో టైపిక్ విషయాల్ని కొట్టిపారేస్తున్నారు.తమకి నచ్చినట్టుగా ఉండడం మాత్రమే కాదు, డీగ్లామర్ పాత్రల్లో నటించడానికి కూడా సై అంటున్నారు.

అలా డీగ్లామర్ రోల్స్ చేసిన కొంతమంది హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం.

H3 Class=subheader-style ఐశ్వర్య రాజేష్ /h3p """/"/ కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో డీగ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది ఐశ్వర్య రాజేష్.

ఈమె దివంగత నటుడు రాజేశ్ గారి కూతురు.అలాగే తెలుగులో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన నటి శ్రీలక్ష్మి గారికి స్వయానా మేనకోడలు.

అయితే ఐశ్వర్య రాజేష్ చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోవడంతో కుటుంబబారాన్ని తన భుజాలపై వేస్కుంది.

చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇప్పుడు మంచి నటిగా పేరు సంపాదించింది.

ఇందువల్లనే తను పోషించే పాత్రల్లో జీవం ఉంటుంది.తన కళ్లల్లో ఏదో సాధించాలన్ని కసి ఉంటుంది.

అయితే తమిళంలో ఎక్కువగా నటించిన ఐశ్వర్య.ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ సరసన పూర్తి మాస్ అండ్ డీగ్లామర్ పాత్రలో  నటించి తెలుగులో కూడా మంచి పేరు సంపాదించింది.

H3 Class=subheader-style ప్రియమణి /h3p """/"/ ప్రియమణి ఎంత మంచి నటినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈమె తన మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది.అయితే ప్రియమణి కూడా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన విల్లన్ సినిమాలో విక్రమ్ చెల్లెలిగా మేకప్ లేకుండానే  పూర్తి స్థాయిలో డీగ్లామర్ రోల్ లో నటించి అందరిని మెప్పించింది.

H3 Class=subheader-style సమంత /h3p """/"/  ప్రెసెంట్ తెలుగు సినిమా టాప్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.

ఈమె నటనకి అభినయానికి పడిపోని ప్రేక్షకుడు ఉండడు.మరి ముఖ్యంగా రంగస్థలం సినిమాలో సమంత రామలక్ష్మి పాత్రలో నటించి నేను గ్లామర్ రోల్స్ లోనే కాదు డీగ్లామర్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించుకుంది.

ఈ సినిమాలో మనం కొత్త సమంతని అచ్చమైన పల్లెటూరి అమ్మాయిని చూడొచ్చు.పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టుగా సాగుతున్న సమంతా సినిమా కెరీర్లో రంగస్థలం రామలక్ష్మి పాత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

H3 Class=subheader-style తమన్నా /h3p """/"/ ఇక మిల్కీ బ్యూటి తమన్నా కూడా బాహుబలి, అభినేత్రి, ఎందుకంటే ప్రేమంట సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించింది.

బాహుబలిలో ఒక రెండు పాటలు తప్ప సినిమా అంత డిఫరెంట్ మేకప్ తో అస్సలు తమన్నానేనా అని అనిపిస్తుంది.

ఇక అభినేత్రి కూడా  డ్యుయల్ రోల్ పోషించింది.ఒకటి గ్లామర్ డాల్ గా, ఇంకోటి పల్లెటూరి భార్యగా ఈ రెండు పాత్రలోకి ఒదిగిపోయి నటించింది తమన్నా.

ఇక ఎందుకంటే ప్రేమంట సినిమాలో కూడా తమన్నా ద్విపాత్రాభినయం చేసింది.ఒకటి గ్లామర్ డాల్.

మరోకటి పల్లెటూరి అమ్మాయి పాత్ర.h3 Class=subheader-style అనుష్క /h3p """/"/ తెలుగు సినిమా చరిత్రలో అనుష్క లాంటి హీరోయిన్ ని మనం చూసుండం.

సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే.అందవిహీనంగా తయారవ్వడానికైనా సిద్ధపడుతుంది.

దీనికి నిదర్శనం బాహుబలి సినిమాలో అమ్మ పాత్ర.అలాగే సైజ్ జీరో సినిమాలో లావుగా వుండే అమ్మాయి పాత్ర.

దానికోసం బాగా తిని 20 కేజీలు వరకు బరువు కూడా పెరిగింది.ఈ రెండు సినిమాల్లో డీ గ్లామర్ గా చూసిన అనుష్కని మొదట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయనప్పటికి తన నటనతో అందరిని కట్టిపడేసింది.

H3 Class=subheader-styleఅమలాపాల్ /h3p """/"/ ఇక తమిళ పాప అమలాపాల్ కూడా తన మొదటి సినిమా ప్రేమఖైదిలో డీ గ్లామర్ రోల్ పోషించింది.

ఆ సినిమా మొత్తం జిడ్డు మొఖం కనిపించడంకోసం అమలాపాల్ కి  మేకప్ వేయకుండా  ఆయిల్ రాసారని  సమాచారం.

H3 Class=subheader-style   సంజనా /h3p """/"/ బుగ్గిగాడు సినిమాలో త్రిష చెల్లి పాత్రలో మనకి బాగా పరిచయమున్న సంజనా కూడా డీ గ్లామర్ రోల్ పోషించింది.

ఈమె దండుపాళ్యం 2సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటించి అందరిని షాక్ కి గురిచేసింది.

ఇదే సినిమాలో సంజన న్యూడ్ గా నటించిందనే వార్తలు కూడా అప్పటి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసాయి.

H3 Class=subheader-style రాధికా ఆప్టే /h3p """/"/ రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి భార్య క్యారెక్టర్లో అదిరిపోయే నటనని కనబరిచిన రాధికా ఆప్టే కూడా ఈ సినిమాలో సాధారణ గృహిణిగా అస్సలు మేకప్ లేకుండా నటించింది.

ఈమె  లేట్ గా కెరీర్ స్టార్ట్ చేసినా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అంటూ వివిధ భాషల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా తనకంటు ఒక ప్రతేయకమైన గుర్తింపును తెచ్చుకుంది రాధికా ఆప్టే.

H3 Class=subheader-style  రితిక /h3p """/"/ విక్టరీ వెంకటేష్ గారు నటించిన గురు సినిమాలో బాక్సర్ గా పరిచయం అయిన నటి రితిక.

ఈ సినిమాలో ఒక సాధారణ చేపలు అమ్మే అమ్మాయిలా పక్కా బస్తి అమ్మాయిలా, బాక్సర్ లాగా డీగ్లామర్ రోల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.

H3 Class=subheader-style అమ్రితా అయ్యర్ /h3p """/"/ బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్రితా ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది.

ఎక్కువ మేకప్ లేకుండా చాల సాధారణమైన పాత్రలో ఈ కొత్తమ్మాయి ఒదిగిపోయి నటించిందనే చెప్పాలి.

ఇంకా ఈ సినిమాలో  నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే.

ఈ హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయండి!