సమ్మర్ లో రిలీజయ్యే టాలీవుడ్ సినిమాల టార్గెట్ అన్ని కోట్లా?

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే.

అయితే ఆ కన్ఫ్యూజన్ కు తెర దించుతూ నిన్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి వరుసగా ప్రకటనలు వెలువడ్డాయి.

ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాల నిర్మాతలకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.

రాధేశ్యామ్, గని, మరికొన్ని సినిమాలు మినహా మిగతా సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి.

ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

మార్చి మొదటి వారం నుంచి మే నెల చివరి వారం వరకు వరుస సినిమాల రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

"""/" / ఈ మూడు నెలల్లో పెద్ద సినిమాలు సాధించాల్సిన కలెక్షన్లు ఏకంగా 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

1500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే మాత్రమే పెద్ద సినిమాలు సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

తెలుగులో పెద్ద సినిమాలకు 100 కోట్ల రూపాయల స్థాయిలో మార్కెట్ జరగగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా మార్కెట్ జరిగిందని సమాచారం.

"""/" / బయ్యర్ల నుంచి నిర్మాతలకు మూడు నెలల్లో 900 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయలు దక్కే ఛాన్స్ అయితే ఉంది.

1500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి.

పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో ఏయే సినిమాలు కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది.

పుష్ప ది రూల్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. జానీకి బదులుగా ఆ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ దక్కిందా?