టాలీవుడ్ ఇండస్ట్రీ ఫాలో అవుతున్నారు సక్సెస్ ఫార్ములా ఇదేనా?

ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే సంవత్సరాల తరబడి ఆడేవి దాన్ని బట్టే ఆ సినిమా కలెక్షన్స్ కూడా ఆధారపడి ఉండేవి .

ఆ తరువాత కాలంలో అది కాస్తా చేంజ్ అయ్యి 100 డేస్ ఒక్క థియేటర్ లో ఆడినట్లైతే ఆయా సినిమాలు సక్సెస్ అయినట్లు భావించేవారు.

కానీ ఇప్పుడు మహా అయితే వారం పది రోజులు ఆడితేనే ఆ సినిమా సక్సెస్ ఫుల్.

విజయం సాదించేసినట్లు ఫీల్ అయిపోతున్నారు.ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ మేకర్సే కాదు, ఫ్యాన్స్ దృష్టి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ మీదే.

ఫస్ట్ డే స్టార్ హీరో రేంజ్ ను బట్టే కలెక్షన్స్ ఉంటాయని ఫ్యాన్స్ కూడా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు.

ఇక ఆ సినిమా హిట్ అయినా.ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే భారీగా దండుకోవాలి అనే ఆలోచనతో ఫస్ట్ డే అనే ఫార్ములా ఫాలో అవుతున్నారు తెలుగు ఫిలిం మేకర్స్.

మరి ఈ ఫార్ములాను ఎలా అప్లై చేస్తున్నారు అలాగే ఎలా గట్టెక్కుతున్నారో తెల్సుకుందాం.

ఇప్పుడు వస్తున్న సినిమాల విషయానికి వచ్చినట్లయితే ఆ సినిమా హిట్, ఫ్లాఫ్ అనే సంబంధం లేకుండా, టికెట్ రేట్స్ పెంచుకుని, ఎక్కువ థియేటర్స్ లో, అలాగే అదనపు షోస్ పెంచుకుని, ఎవరైతే సినిమాను రిలీజ్ చేస్తారో వాళ్లే సినిమాకు పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టుకోగలరు అనే ఆలోచనను ఇప్పుడు ఫిలిం మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.

అంతేకాదు ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ నుంచి ఈ నెల 12న వచ్చిన సర్కార్ వారి పాట వరకు కూడా ఇదే ఫార్ములాను అప్లై చేసినట్లు కనిపిస్తుంది.

కాగా కరోనా మహమ్మారి వల్ల ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కాస్తా వాయిదా పడటంతో ఆ సినిమాల బడ్జెట్ అనుకున్న దానికన్నా కొంచెం పెరిగిపోయింది.

దాంతో ఇండస్ట్రీ మొత్తంగా తమ సినిమా రిలీజ్ కి వారం రోజుల వరకు ఎటువంటి సినిమాలు లేకుండా చూసుకుని మరి తమ సినిమాల రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక చిన్న సినిమాలు సూపర్ హిట్ అయితే తప్ప పెట్టిన బడ్జెట్ వచ్చే పరిస్తితి కనిపించడం లేదు.

"""/" / ఇక కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లైతే సర్కారు వారి పాట ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 75 కోట్లు.

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 235 కోట్లతో టాప్ లో ఉంది.

అదే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 71 కోట్లతో లో రేంజ్ లో ఉండగా.

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 53 కోట్లకే పరిమితమైంది ఆచార్య.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters