ఈ మధ్య కాలంలో అటకెక్కిన టాలీవుడ్ స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు ఇవే!

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు వేర్వేరు కారణాల వల్ల ప్రాజెక్ట్ లను ప్రకటించి షూట్ మొదలుపెట్టకుండానే ఆ ప్రాజెక్ట్ లను ఆపేస్తున్నారు.

క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ విధంగా ఆగిపోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది.

క్రేజీ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడి ఆ సినిమాలు ఆగిపోవడంపై ఆ సినిమాల అభిమానులు సైతం తెగ ఫీలవుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఆగిపోయిన ప్రాజెక్ట్ లలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఒకటి.

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుందని అందరూ అనుకున్న సమయంలో ఊహించని విధంగా ఆగిపోయింది.

ఆ తర్వాత తారక్ త్రివిక్రమ్ కు బదులుగా కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే.

సూర్య బాల కాంబినేషన్ లో అచలుడు టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడి ఆగిపోయింది.

పవన్ సముద్రఖని డైరెక్షన్ లో ఒక సినిమాలో, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనుండగా ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో క్లారిటీ లేదు.

అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఐకాన్ మూవీ కూడా ఆగిపోయినట్టేనని తెలుస్తోంది.

"""/"/వకీల్ సాబ్ హిట్టైనా వేణు శ్రీరామ్ ను నమ్మి ఛాన్స్ ఇవ్వడానికి బన్నీ ఆసక్తి చూపడం లేదు.

వేణు శ్రీరామ్ పాన్ ఇండియా హిట్ ఇస్తాడనే నమ్మకం లేక బన్నీ ఈ విధంగా చేశారని తెలుస్తోంది.

చిరంజీవి వెంకీ కుడుముల కాంబో మూవీపై కూడా ఇవే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/"/ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు కొన్నిరోజుల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి.ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

క్రేజీ ప్రాజెక్ట్ లు ఆగిపోతూ ఉండటంతో అభిమానులు సైతం తెగ ఫీలవుతున్నారు.భారీ బడ్జెట్ సినిమాలు ఆగిపోతూ ఉండటం చాలామంది టెక్నీషియన్లపై ప్రభావం చూపుతోంది.

Healthy Salad : నిత్యం ఈ టేస్టీ సలాడ్ ను తిన్నారంటే వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ తో స‌హా అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!