సొంత బంగ్లాను వదులుకుని అద్దె ఇళ్లల్లో కాలం గడుపుతున్న సెలెబ్రిటీలు వీరే.. !!

సగటు మనిషి కనే ప్రతి కల సొంత ఇంటి నిర్మాణం.తాను ఒక ఇల్లు కొనుక్కుని, నచ్చినట్లు అందులో జీవించాలని ఎన్నో కలలు కంటారు.

మన పాత కాలంలో పెద్దలు కట్టించిన ఇళ్ళు ఇంకా కొన్ని ఊళ్లలో అలానే ఉన్నాయి.

ఎందుకంటే ఆ ఇంటిని తర తరాల పిల్లలు వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకార్ధం కోసం అలాగే ఉంచుకుంటారు.

ఈ కాలంలో చాలామంది సెలిబ్రిటీలకు సైతం కళ్ళు చెదిరే భవనాలు ఉన్నాయి.రాజభవనం లాంటి ఇళ్ళు ఉన్నాయి.

కానీ కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద ఇల్లు ఉన్నాగాని డబల్ బెడ్ రూమ్ లేదంటే ట్రిపుల్ బెడ్ రూమ్ లలో నివాసం ఉంటున్నారు.

లంకంత ఇంటిని వదిలిపెట్టి సాదాగా జీవనం గడుపుతున్న ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

"""/"/ ఈ లిస్ట్ లో హీరోలలో మహేష్ బాబు ముందు ఉంటాడు.ప్రిన్స్ మహేష్ బాబు పేరుకి తగ్గట్టే జూబ్లీహిల్స్ లో అతి పెద్ద రాజభవనం ఉంది.

కానీ ఈ భవనం కాదని జువెనేస్టిక్ కాలనిలో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ లోకి మారిపోయాడు.

ఆ ఎదురింటిలో మహేష్ బాబు అక్క అయిన మంజుల కూడా నివాసం ఉంటుంది.

బాబు కి ఉన్న ఆస్తి ఐశ్వర్యం ముందు ఈ ప్లాటు ఏమాత్రం సూట్ కాదు అని చెప్పవచ్చు.

సుమారు పది వేల కోట్ల రూపాయిల ఆస్థి పాస్తులు మహేష్ బాబు సొంతం.

కానీ ఇవేమి కాదని సదా సీదా జీవనం గడుపుతున్నాడు. """/"/ తర్వాత వరసలో అక్కినేని నాగ చైతన్య కూడా వస్తాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత వారసుడు, అలాగే రామానాయుడు స్టూడియోస్ కి సంబంధం ఉన్నవాడు.

నాగ చైతన్య కావాలంటుకుంటే అటు అక్కినేని, ఇటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి ఇవ్వగలరు.

అలాంటి నాగ చైతన్య అబిడ్స్ మాల్ దగ్గర ఉన్న సదా సీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు.

తన రెండవ సినిమా నుంచి ఈ ఇంటిలోనే మకాం వేసాడు.పెళ్లయిన గాని భార్య సమంతతో కలిసి ఆ ఇంటిలోనే ఉంటున్నాడు.

కారణం ఏంటంటే ఆ ఇంటిని తన తల్లి అయిన దగ్గుబాటి లక్ష్మి ఇంటీరియర్ డిజైన్ చేయించడంతో ఆ సెంటిమెంట్ కొద్ది ఈ ఫ్లాట్ వదిలేది లేదు అంటున్నాడు అక్కినేని నాగ చైతన్య.

"""/"/ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కొన్నేళ్ల పాటు నందగిరి హిల్స్ లోని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండేవాడు.

కానీ ఆ తర్వాత అక్కడి నుంచి ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయాడు.

అక్కడ నేలతో పవన్ కళ్యాణ్ కి మంచి రిలేషన్ ఉంటుంది.మొక్కలు పెంచడం, వ్యవసాయం చేయడంలాంటివి పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం.

ఆ మట్టి మీద ఉన్న మమకారంతో పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు.

ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చాక అమరావతిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.

"""/"/ అలాగే నటుడు జగపతిబాబు కి కూడా అపోలో దగ్గరలో 1000 గజాలలో భారీ బంగ్లా ఉంది.

ఈ బంగ్లాని కాదనుకుని కూకట్ పల్లిలోని రోటా టవర్స్ లోని ఒక ప్లాట్ లో ఉంటున్నాడు.

ఆలీ కూడా అంతే శ్రీనగర్ కాలనిలో పెద్ద బంగ్లా ఉంటే అది కాదని మణికొండలోని ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో నివాసం ఉంటున్నాడు.

"""/"/ అలాగే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా అంతే.అంతెందుకు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి దగ్గర దగ్గర 30 కోట్లు దాకా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

అంత పెద్ద హోదాలో ఉండి కూడా తాను ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లాలు అవసరం లేదంటున్నాడు రాజమౌళి.

పెళ్లయిన దగ్గర నుండి మణికొండలోనే ఉంటున్నాడు మొదట్లో ఒక విల్లాలో ఉన్న రాజమౌళి తరువాత దానిని అద్దెకి ఇచ్చేసి ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నాడు ఈ దర్శకధీరుడు.

"""/"/ ఇక పోతే సుకుమార్ మణికొండలో ఒక మంచి బంగ్లా నిర్మించుకున్నాడు.అయితే అందులోకి జనం ఎడతెరిపి లేకుండా వచ్చేసేవారట.

వాళ్ళ తాకిడి తట్టుకోలేక గచ్చిబౌలిలో గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అయిపోయాడు సుకుమార్.బంగ్లాలో ఒంటరిగా ఉండడం కంటే పదిమందితో అపార్ట్మెంట్స్ లో ఉంటే మంచిది అని ఆలోచించారేమో మన స్టార్ హీరోలు, దర్శకులు.

ఏదేమయిన అంత ఆస్థి ఉంచుకుని కూడా సాదాసీదా జీవితం గడుపుతున్నారు అంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు.

దటీజ్ బాలయ్య… అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య?