సినిమాల్లో నటించడం కారణంగానే ఈ నటులంతా పిచ్చివాళ్ళయ్యారంటే నమ్ముతారా.?
TeluguStop.com
సినిమా.ఇదొక రంగుల ప్రపంచం.
ఈ ప్రపంచంలో మనకు పరిచయం అయిన వారిని ప్రేమిస్తాం.పూజిస్తాం.
ముఖ్యంగా ఈ రంగుల ప్రపంచంలో అందమైన హీరోయిన్లను అయితే మన గుండెల్లో పెట్టుకుంటాం.
అలా 1911 సంవత్సరంలో మన మొదటి తెలుగు హీరోయిన్ రాజలక్ష్మి గారి దగ్గర నుండి మొన్నీమధ్య వచ్చిన రష్మిక మందన్న వరకు ఎంతోమంది హీరోయిన్లను మనం ఆదరించం వారిని పూజించాం.
అయితే దీపం ఉన్నప్పుడే మనకు వెలుగు అన్నట్టుగా సినిమా అవకాశాలు ఉన్నంత వరకే ఏ హీరోయిన్ కి అయినా గౌరవం మర్యాద.
సో, అవకాశాలు తగ్గిపోయిన కొంతమంది హీరోయిన్లు, నటీనటులు వారి చివరి రోజుల్లో పిచ్చివాళ్లుగా తనువు చాలించారు.
వారెవరో ఇప్పుడోసారి చూద్దాం.ఈ లిస్ట్ లో ఎస్.
వరలక్ష్మి గారు మొదటి వరసలో ఉన్నారు.ఈమె 1937 సంవత్సరంలో జగ్గంపేటలో జన్మించారు.
సత్యహరిచంద్ర లో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఎస్.వరలక్ష్మి పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి.
వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాల్లో ఆమె నటించారు.
ఇక ఆతర్వాత ప్రముఖ నిర్మాత ఏ.ఎం శ్రీనివాస్ ను పెళ్ళాడారు.
వారికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.అయితే ఎస్ వరలక్ష్మి ఎవరిని ఎక్కువగా కలిసేది కాదు.
ఎక్కడికి వెళ్ళేది కాదు.సినిమా ఫంక్షన్స్ ను తప్పించుకునే వారు.
ఇంకా చాలా విషయాల్లో ఈమే కన్నాంబను ఆదర్శంగా తీసుకుని వారు.ఇంకా ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా కూడా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించింది.
అంతేకాదు వాళ్ళ ఇంట్లో వాళ్లు ఆమెను బయటకు పంపించేవారు కాదట, ఒకవేళ ఎవరైనా చూడటానికి వచ్చినా తన ఆరోగ్యం బాలేదు అని చెప్పి పంపించేసేవారట.
అంతపెద్ద కళాకారిణి అయినప్పటికీ ఆమెని నాలుగేళ్ల పాటు గదిలోనే బందీ చేశారట.ఆమెకి మతి బ్రమించింది అందుకే బయటకి రానివ్వడం లేదని చెప్పేవారట.
చివరికి ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని కూడా ఎవరికీ చూపించలేదు. """/"/
ఇక ఈలిస్టులో రెండొవ హీరోయిన్ కాంచనమాల గారు.
ఈమే జనవరి 5, 1917 లో జన్మించారు.తొలితరం నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.
కాంచనమాల గారిది తెనాలి పట్టణం.ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణుల్లో కాంచనమాల ఒకరు.
చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న ఆమే సినిమాల్లోకి ప్రవేశించారు.కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి ఆమె చేత వై.
వి.రావు గారు ఆయన నిర్మించిన శ్రీకృష్ణ తులాబారం లో మిత్రవింద వేషం వేయించారు.
ఆ సినిమాలో తన నటనతో అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు కాంచనమాల.ఆ తర్వాత వీరాభిమన్యు చిత్రంలో, ఇంకా మాల పిల్లా సినిమాలో ఇంత అందంగా ఉంటే ఎవరూ పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల.
కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం అందమైన కాంచనమాల గారికి మంచి పేరు రావడం నిజంగా అభినందనీయం.
"""/"/
అందుకే అప్పట్లోనే కాంచనమాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి.ఇక కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య ను ప్రేమించి పెళ్లాడారు.
ఆమె సొంత ఊరు తెనాలిలోనే శాంతి భవనం అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నారు కాంచనమాల.
అలా ఆమె ఇంట్లో నివసించేటప్పుడు.ఆ పక్కింటి వారు కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు.
అలా నిత్యం తన కళా జీవితం గురించి ఆలోచించడం తో మతిభ్రమించింది.దానితో సమీప బంధువులు ఆమెని పిచ్చి ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ మరింత క్షోభకు గురయ్యి గతం అంతా మర్చిపోయింది.పిచ్చిదానిలా మారిపోయింది.
చివరికి 1981 జనవరి 24న మద్రాసులో కన్ను ముసారు. """/"/
ఇక ఈకోవకు చెందిన ఇంకొక నటులు పద్మనాభం గారు.
హాస్య నటుడుగా ప్రసిద్ధి పొందిన నటుడు పద్మనాభం.ఈయన ఆగస్టు 20, 1931 న జన్మించాడు.
ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు.ఈయనకు చిన్నప్పట్నుంచే సంగీతమన్నా, పద్యాలన్న ఎంతో ఇష్టం.
చిన్నప్పటి నుంచి పద్యాలు పాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.ఆ ఊరి టెంట్ హాల్ లో ద్రౌపది వస్త్రాపహరణం, వందేమాతరం, సుమంగళి, శోభన వారి భక్త ప్రహ్లాద సినిమా ఇవన్నీ చూసి కొన్ని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు అనుకరించేవాడు.
ఆ తర్వాత ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఎన్నో సినిమాల్లో నటించారు.ఒక మంచి ఎనర్జీ ఉన్న హాస్య నటుడుగా ఎన్నో సినిమాల్లో మనల్ని అలిరించిన ఈయన కూడా చివరి రోజుల్లో మతి స్థిమితం లేక పిచ్చి పిచ్చిగా బెహేవ్ చేవావరని తెలిసింది.
ఇక చివరికి చెన్నై లో ఫిబ్రవరి 20, 2010 లో గుండెపోటుతో మరణించారు.
స్కంద ఫ్లాపైనా భారీగా రెమ్యునరేషన్ పెంచిన బోయపాటి.. పారితోషికం ఎంతంటే?