హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టైనా స్పందించని టాలీవుడ్ స్టార్స్.. ఈ తీరు రైటేనా అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.థియేటర్ల సంఖ్య పెంచితే హనుమాన్ మూవీ కలెక్షన్ల విషయంలో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇప్పటికే మెజారిటీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా త్వరలో ఇతర ఏరియాలలో కూడా బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని చెప్పవచ్చు.

"""/" / హనుమాన్ మూవీ( Hanuman Movie ) నిర్మాత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఈ సినిమాతో భారీ లాభాలను సొంతం చేసుకున్నారు.

హనుమాన్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో జై హనుమాన్ సినిమాకు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కచ్చితంగా పుంజుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / అయితే హనుమాన్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించినా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ ఈ సినిమా గురించి స్పందించడం లేదు.

ఈ సినిమా విషయంలో ఇంత కఠినంగా స్టార్స్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదు.

చిన్న సినిమాలు సక్సెస్ సాధించడం అరుదుగా జరుగుతుంది.అలా సక్సెస్ సాధించిన సమయంలో ఆ సినిమాలను స్టార్స్ ప్రశంసలు లభిస్తే ఆ సినిమాల కలెక్షన్లు పుంజుకుంటాయి.

"""/" / సంక్రాంతి సినిమాలలో బడ్జెట్ కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే మాత్రం హనుమాన్ సినిమానే నంబర్1 స్థానంలో నిలుస్తుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ఈ ఏడాది భారీ లాభాలను అందించిన సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

హనుమాన్ సక్సెస్ తో కొత్త తరహా సినిమాలు తెరకెక్కించాలని భావించే వాళ్లు ఆ తరహా కాన్సెప్ట్ లతో ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.

విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?