ఒక్క ఫ్లాప్ పడగానే పూర్తిస్థాయి జ్ఞానోదయం పొందిన స్టార్ హీరోస్ !

ఏదైనా దెబ్బ తగిలి వరకు దాని విలువ తెలియదు.అందుకే అప్పటి వరకు ఏం చేసినా చెల్లుతుందిలే అనే భావనతో చేస్తారు.

అలాగే చేసి పప్పులో కాలేస్తూ కూడా ఉంటారు.అప్పటి వరకు వరస విజయాలు సాధించిన కొంతమంది ఒక ఫ్లాప్ రాగానే అసలు విషయం ఏంటో జ్ఞానోదయాన్ని చెందుతారు అలా కొన్నిసార్లు చేసిన పొరపాట్ల వల్ల తమ కెరియర్ లో సరిదిద్దుకోలేని తప్పులు చేసి ఆ తర్వాత అలాంటి తప్పు చేయకూడదు అని డిసైడ్ అయిన కొంత మంది స్టార్ హీరోస్ ఉన్నారు.

వారెవరు ? వారు చేసిన తప్పులు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఉదాహరణకు దర్శకుడు సుకుమార్( Sukumar ) ని తీసుకుంటే ఆయన చాలా తెలివిగా సినిమాలు తీస్తారు.

లెక్కల మాస్టారు కాబట్టి ప్రతి విషయాన్ని చాలా క్యాలికలేటెడ్ గా సినిమాలో చూపిస్తూ వస్తారు.

ఉదాహరణకి 1.నేనొక్కడినే సినిమాను తీసుకుంటే అది టాలీవుడ్ రేంజ్ మూవీ కానీ తెలుగు ప్రేక్షకులకు అర్థం కాలేదు.

అప్పుడే సుకుమార్ తాను సినిమా తీస్తే తనకు మాత్రమే అర్థం అయితే సరిపోదని చూసే ప్రేక్షకులకు కూడా అర్థం కావాలని నిర్ణయించుకున్నారు దాంతో జనాలు మెచ్చుకునే స్టోరీస్ ని తీయడం మొదలుపెట్టారు.

ఇక లైగర్ సినిమా పరాజయం విజయ్ దేవరకొండలో చాలా మార్పును తీసుకొచ్చింది. """/" / ఒక సినిమా గురించి భారీగా హైప్ ఇచ్చాక అది జనాలకు నచ్చకపోతే ఎంత భారీ నష్టం వస్తుందో లైగర్ సినిమా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )కు తెలిసి వచ్చేలా చేసింది.

దాంతో ఇకపై తాను చేయబోయే మరో మూడు సినిమాల షూటింగ్స్ పూర్తయి విడుదల అయ్యే వరకు కూడా తాను మాట్లాడకూడదు అనే నిర్ణయానికి వచ్చారట.

చిరంజీవి కూడా ఈ లిస్టులోకి వచ్చేసారు.ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు తీసి విజయాలు సాధించారు గతంలో.

కానీ ఓటిటి ప్లాట్ ఫామ్స్ విస్తరించిన తర్వాత భాష ఏదైనా ప్రేక్షకులు సినిమాలు చూస్తున్నారు.

అందుకే రీమేక్ సినిమాలు ఆడే రోజులు కావు ఇవి అని ఆయన అర్థం చేసుకున్నారు.

ఒకవేళ బోలా శంకర్ సినిమా( Bhola Shankar ) కనుక విజయం సాధిస్తే కచ్చితంగా మళ్ళీ ఆయన రీమేక్ సినిమాలను చేయడానికి ఒప్పుకునేవారు.

కానీ ఈ సినిమా పరాజయం ఆయనలో చాలా మార్పులు తీసుకొచ్చింది.

వీడియో వైరల్.. హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!