2024 సెకండాఫ్ మొత్తం ఆ నలుగురు స్టార్ హీరోలదే.. ప్యాన్ ఇండియా మోత మోగిపొద్ది..!

సంక్రాంతి తర్వాత కేవలం డీజే టిల్లు మినహా సరైన విజయాలు లేవు మొదటి ఆరు నెలలు అరకొర విజయాలతోనే గట్టెక్కల్సి వచ్చింది.

ఇక పాన్ ఇండియా వ్యాప్తంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల అవలేదు.దాంతో ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ముగిసిపోబోతోంది.

అయితే 2024వ సంవత్సరం సెకండ్ హాఫ్ మొత్తం పాన్ ఇండియా వ్యాప్తంగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అల్లాడించబోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలన్నీ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే విడుదలవడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రభాస్ ( Prabhas )నుంచి రాంచరణ్ వరకు అల్లు అర్జున్ నుంచి తారక్ వరకు అందరూ తమ షెడ్యూల్ పూర్తి చేసే పనిలోనే ఉన్నారు.

"""/" / కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా( Devara ) ఖచ్చితంగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటున్నారు.మొదట ఏప్రిల్ లో విడుదల చేయాలని భావించిన సినిమాకి సంబంధించిన పనులు పూర్తకపోవడంతో ఇప్పుడు అక్టోబర్ కి ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.

ఇక గేమ్ చేంజర్ సినిమా( Game Changer )ని సైతం ఎలా అయినా ఈ ఏడాది విడుదల చేయాలని డైరెక్టర్ శంకర్ గట్టిగా నిర్ణయించుకున్నారట అందుకు దిల్ రాజు సపోర్ట్ కూడా దొరుకుతుందట.

త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.ఈ ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరు పాన్ ఇండియా వ్యాప్తంగా తమ సినిమాలను విడుదల చేసి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.

"""/" / ఇక ఇప్పుడు ప్రస్తుతం పుష్ప రాజ్ మానియా నడుస్తోంది.తగ్గేదేలే అంటూ రూల్ చేయడానికి సిద్ధమవుతున్న పుష్ప టీం 1,000 కోట్ల మార్కెట్ పై టార్గెట్ పెట్టింది.

ప్రపచవ్యాప్తంగా పుష్ప ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.సుకుమార్ సైతం పుష్ప సీక్వెల్ లో అతి త్వరలో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నాడు.

ఇక సలార్ మొదటి పార్ట్ సినిమాతో సెన్సేషనల్ సృష్టించాడు ప్రభాస్.ఇక ఇప్పుడు కల్కి సినిమా( Kalki 2898 AD )తో ప్యాన్ ఇండియా పై దండయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

టాలీవుడ్ నలుగురు స్టార్ హీరోలు మొత్తానికి సెకండ్ హాఫ్ లో తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..