డ్రగ్స్‌ కేసు : టాలీవుడ్‌ స్టార్స్‌ లో వణుకు మొదలైంది

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది.

బాలీవుడ్ కు చెందిన ఎంతో మందికి టాలీవుడ్ ప్రముఖులతో కూడా సంబంధాలు కలిగి ఉంటారు.

ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ ఉత్తరాది నుంచి వచ్చిన వారే అనే విషయం తెలిసింది.

ఈ విషయంలో టాలీవుడ్ హీరోయిన్స్ మరియు హీరోలు ప్రస్తుతం టెన్షన్ పడుతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులకు సంబంధించిన పేర్లు జాతీయ మీడియాలో వస్తున్నాయి.

ముందు ముందు ఇంకా పెద్ద స్టార్స్ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ లో స్టార్ గా వెలుగుతున్న హీరోయిన్స్ మరియు హీరోలు డ్రగ్స్ కేసు విషయంలో ముందస్తుగానే లాయర్లతో మాట్లాడుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

మీడియాలో పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా మరికొంత మంది కూడా డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న వారు తమ పేరు బయటికి రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

డిల్లీ స్థాయిలో కూడా కొంత మంది లాబీయింగ్ చేస్తున్నట్లు గా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసు గతంలో నీరుగారి పోయినా ఈసారి మాత్రం చాలా సీరియస్‌గానే ఉంటుందనిపిస్తుంది.

రాబోయే రోజుల్లో బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు ఈ కేసు షిఫ్ట్ అయితే ఎలాంటి పరిణామాలు మన స్టార్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

ఇప్పటికే టాలీవుడ్‌ కు చెందిన కొందరి పేర్లు బయటకు వస్తే వారు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా ప్రకటించారు.

బయటకు కాస్త సీరియస్‌ గానే మాట్లాడుతున్నా కూడా కొందరు మాత్రం ఆందోళనతో వణికి పోతున్నారట.

త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన వారికి సమన్లు జారీ చేసేందుకు ఎన్‌సీబీ సిద్దం అవుతుంది.

ఆ సమయంలో అసలు ఈ కేసులో ఎవరు ఉన్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.