ఒకే మూవీ.. డిఫరెంట్ లుక్స్.. అలరించబోతున్న టాలీవుడ్ స్టార్స్..
TeluguStop.com
ఏ పాత్ర అయినా ఒదిగిపోయి నటించాలి.ఇది చేయను.
అది చేయను.అని చెప్పకూడదు.
అప్పుడే సంపూర్ణ నటులు అవుతారు.ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో ఉన్నారు చాలా మంది నటులు.
ఒకే సినిమాలో రకరకాల గెటప్స్ తో కనిపించేందుకు రెడీ అవుతున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి రోల్స్ చాలా మంది చేస్తున్నారు.
తాజాగా మూడు సినిమాల్లో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఆచార్య సినిమాలో సాధారణ పౌరుడిగా, నక్సలైట్ గా కనిపించ బోతున్నాడు.అటు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లోనూ ఈయన రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటు త్రిఫుల్ ఆర్ సినిమాలోనూ రాంచరణ్, ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ.1920 బ్యాక్ డ్రాప్‌లో ఢిల్లీ నేపథ్యంలో స్టోరీ నడుస్తుంది.
ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు.
ఈ సినిమాలో తాను మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు రాంచరణ్ వెల్లడించాడు.పోలీసు అధికారి, అల్లూరితో పాటు మరో లుక్ లో కనిపిస్తాడట.
అటు ఎన్టీఆర్ కూడా యంగ్ భీమ్ తో పాటు ఓల్డ్ వేరియేషన్ లో కనిపిస్తాడట.
ఇదే కాదు.శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలోనూ రాంచరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట.
ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారే పాత్రలో తను నటిస్తాడట. """/" /
అటు ప్రభాస్ తాజా మూవీ సలార్ లోనూ రెండు పాత్రల్లో కనిపిస్తాడట.
ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.అటు రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో రావణాసుర సినిమాలో పది గెటప్స్ లో కనిపిస్తాడట.అటు ఖిలాడి సినిమాలోనూ ఆయన డ్యుయెల్ రోల్ చేశాడు.
ఫిబ్రవరి 11న ఖిలాడి విడుదల కానుంది.సెప్టెంబర్ 30న రావణాసుర జనాల ముందుకు రానుంది.
అటు నాగ చైతన్య నటిస్తున్న థ్యాంక్యూ సినిమాలోనూ మూడు పాత్రల్లో కనిపిస్తాడట.అమిర్ ఖాన్ మూవీ లాల్‌సింగ్ చద్దాలో కూడా నాగ చైతన్య రెండు పాత్రలు చేస్తున్నాడు.
నితిన్ హీరోగా రాబోతున్న పవర్ పేట వేట సినిమాలో రెండు క్యారెక్టర్స్ చేస్తున్నాడట.
సత్యదేవ్ తాజా మూవీ గుర్తుందా.శీతాకాలంలో మూడు పాత్రలు చేస్తున్నాడట.
అటు నాని నటిస్తున్న దసరా సినిమాలోనూ రెండు పాత్రలు చేస్తున్నాడట.రామ్ కూడా ది వారియర్ సినిమాలో రెండు రోల్స్ పోషిస్తున్నాడట.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?