వెండితెర మీద వెలుగొందిన నటుల వారసులు మాత్రం టీవీల్లో స్టార్స్ అయ్యారు
TeluguStop.com
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది మహా నటులు తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.
అద్భుత నటనతో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
అలనాటి మేటి నటుల వారసులు కొందరు ప్రస్తుతం బుల్లి తెరను ఏలుతున్నారు.టాప్ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.
ఇంతకీ ఆ నటవారసులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleసాత్విక్ కృష్ణ/h3p """/"/
ఈటీవీలో వస్తున్న అమ్మ సీరియల్ లో నటిస్తున్న సాత్విక్ కృష్ణ మరెవరో కాదు.
తన కంచు కంఠంతో తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన జగ్గయ్య మనువడు.కోయిలమ్మ, ఆడదే ఆధారం, స్వాతి చినుకులు సహా పలు టాప్ సీరియల్స్ లో ఆయన నటించాడు.
H3 Class=subheader-styleసాక్షి శివ/h3p """/"/
అటు స్టార్ మాలో ఇటీవల ముగిసిన మౌనరాగం సీరియల్ లో నటించిన సాక్షి శివ స్వయంగా సాక్షి రంగారావుకు చిన్న కుమారుడు.
ఆడదే ఆధారం, నెంబర్ వన్ కోడలు, అక్క మొగుడు సహా పలు సీరియల్స్ లో శివ నటిస్తున్నాడు.
H3 Class=subheader-styleజిఎస్ హరి/h3p """/"/
పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో నటించిన జిఎస్ హరి ప్రస్తుతం జీ తెలుగులో వచ్చే సూర్యకాంతం సీరియల్ లో నటిస్తున్నాడు.
సీతా మహాలక్ష్మి, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి సీరియల్స్ లో యాక్ట్ చేశాడు.
ఈయన మెగాస్టార్ చిరంజీవి కజిన్.h3 Class=subheader-styleదేవిశ్రీ/h3p """/"/
అటు సినిమాలతో పాటు సీరియల్స్ లో రాణిస్తున్న దేవిశ్రీ మురళీ మోహన్ కి స్వయానా మేన కోడలు.
ఇద్దరమ్మాయిలు, గోరింటాకు సీరియల్స్ లో తను నటించింది.h3 Class=subheader-styleసాయి కిరణ్/h3p """/"/
నువ్వే కావాలి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి కిరణ్ ఆ తర్వాత బుల్లితెర వైపు మళ్లాడు.
కోయిలమ్మ, గుప్పెడంత మనసు సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యాడు.ప్రముఖ సింగర్స్ జ్యోతి, రామకృష్ణ దంపతుల కొడుకే ఈ సాయి కిరణ్.
H3 Class=subheader-styleశ్రావ్య శృతి/h3p """/"/
తులసిదళం సీరియల్ ద్వారా బుల్లితెరపై బాల నటిగా అడుగు పెట్టిన శ్రావ్య శృతి పెద్దయ్యాక గోకులం అపార్ట్ మెంట్, పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్స్ చేసింది.
ప్రస్తుతం మనసు మమత సీరియల్ లో నటిస్తోంది.ఈమె ప్రముఖ నటుడు, గాయకుడు నల్లూరి సుధాకర్ చిన్న బిడ్డ.
వీరితో పాటు పలువురు నటుల వారసులు టీవీ సిరియల్స్ లో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందారు.
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!