అక్టోబర్‌ నుండి అందరూ రంగంలోకి దిగబోతున్నారు

తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్‌ ల సందడి మెల్లగా ప్రారంభం అవుతోంది.గత ఆరు నెలల కాలంగా షూటింగ్స్‌ లేక బోసి పోయిన లొకేషన్స్‌ మరియు ఇతరత్ర స్టూడియోలో ఇప్పుడు షూటింగ్స్‌ తో మెల్లగా బిజీ అవుతున్నాయి.

ఆరు నెలల పాటు సినిమా పనులు లేక ఆకలితో అలమటించిన సినీ కార్మికులకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు దక్కుతున్నాయి.

సెప్టెంబర్‌ నెలలో చాలా సినిమాలు మొదలు అయ్యాయి.కాని ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ మాత్రం ప్రారంభం అయినట్లుగా అనిపించడం లేదు.

టాలీవుడ్‌ లో టాప్‌ హీరోల సినిమాలు మొదలు కూడా అతి త్వరలోనే ఉండబోతుంది.

ఇప్పటికే 50 నుండి 60 శాతం షూటింగ్స్‌ సెప్టెంబర్‌ లో జరుగుతున్నాయి.ఇక మిగిలి ఉన్న సినిమాలు కూడా అక్టోబర్‌ నుండి మొదలు కాబోతున్నాయి.

కరోనా మహమ్మారికి భయపడుకుంటా ఉంటే అది ఎప్పటి వరకు క్యూర్‌ అయ్యేనో ఎప్పటి వరకు వ్యాక్సిన్‌ వచ్చేనో తెలియదు.

కనుక ఏమాత్రం డౌట్‌ లేకుండా షూటింగ్‌లకు వెళ్లి పోవాలని భావిస్తున్నారు.అయితే సినిమాల మేకింగ్‌ సమయంలో సాధ్యం అయినంత వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తల విషయంలో కఠినంగా ఉండాలంటూ నిర్ణయించారు.

ఇక అక్టోబర్‌ నుండి మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌, అల్లు అర్జున్‌ ఫుష్ప, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, వెంకటేష్‌ నారప్ప ఇంకా కొన్ని చిన్నా చితక సినిమాలు పెద్ద సినిమాలు కూడా పట్టాలెక్కబోతున్నాయి.

థియేటర్లకు అక్టోబర్‌ నుండి అనుమతి వచ్చే అవకాశం ఉంది కనుక జనవరిలో విడుదల చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో షూటింగ్‌కు త్వరపడుతున్నారు.

క్యాండీ క్రష్ గేమ్ కోసం రూ.30 లక్షల చర్చి నిధులు వాడేసిన పాస్టర్‌..??