కన్నీటి పర్యంతమైన నటి రకుల్ ప్రీత్ సింగ్.. కారణమేంటంటే..?
TeluguStop.com
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటించిన కొండపొలం సినిమా ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుంది.
వైష్ణవ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో డీ గ్లామరస్ పాత్రలో నటించడం గమనార్హం.
తెలుగుతో పోలిస్తే బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం గమనార్హం.
తాజాగా బెల్ బాటమ్ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
థియేటర్ లో తాను చాలా నెలల తరువాత సినిమాను చూశానని స్క్రీన్ పై టైటిల్స్ ప్రారంభమైన సమయంలో తెలియకుండానే తాను భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించారు.
సంతోషంతో తనకు కన్నీళ్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.కరోనా సెకండ్ వేవ్ వల్ల క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసిన బెల్ బాటమ్ చిత్రబృందానికి రకుల్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం 6 కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి.
బాలీవుడ్ లో రకుల్ నటించిన సినిమాలు హిట్టైతే ఆమె వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.
బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్లు ఉండటం వల్లే రకుల్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
"""/"/
స్టార్ హీరోయిన్ రకుల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఆక్కడి హీరోయిన్లకు రకుల్ గట్టి పోటీని ఇస్తున్నారు.
తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన స్టార్ హీరోలతో రకుల్ ఇప్పటికే నటించారు.
ఈ హైప్ సరిపోదు డాకు మహారాజ్.. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా?