నిర్మాతలను అలా దోచుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. దొంగ లెక్కలు చెప్పి?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఊహించిన స్థాయిలో పెరిగాయి.

సక్సెస్ రేట్ ఆధారంగా హీరోయిన్లు నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సిద్ధపడుతున్నారు.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్ మిడిల్ రేంజ్ హీరో మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఈ హీరోయిన్ ఇలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేం కాదు.అయితే ఈ హీరోయిన్ కు పర్సనల్ గా క్యాస్టూమ్ డిజైనర్ ఉండగా ఈ స్టార్ హీరోయిన్ నిర్మాతకు దొంగ లెక్కలు చెప్పి క్యాస్టూమ్స్ కోసం దాదాపుగా 20 లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం.

సాధారణంగా సినిమాకు పని చేసిన క్యాస్టూమ్ డిజైనర్ ఒక పాట కోసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేస్తారు.

అయితే హీరోయిన్ పాటలో ధరించిన ఒక్కో క్యాస్టూమ్ కు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క చూపించారు.

ఈ విధంగా హీరోయిన్ నిర్మాతను కొత్త తరహాలో దోచుకోవడం గమనార్హం.ఈ హీరోయిన్ తెలివి తేటలను చూసి షాకవ్వడం నిర్మాత వంతవుతోంది.

హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు అదనపు ఖర్చులకు సంబంధించిన భారాన్ని కూడా నిర్మాతలపై మోపుతున్నారు.

"""/" / ఇలా చేస్తున్న కొందరు హీరోయిన్ల వల్ల నిర్మాతలకు బడ్జెట్ భారం అంత కంతకూ పెరుగుతోంది.

హీరోయిన్లు సక్సెస్ లో ఉంటే ఈ డిమాండ్లు మరింత పెరుగు తున్నాయి.ఈ తరహా డిమాండ్లు చేస్తున్న హీరోయిన్లు భవిష్యత్తులో ఫ్లాపులు ఎదురైన సమయంలో మాత్రం ఇబ్బందులు పడక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు తోడు ఇలాంటి హీరోయిన్ల వల్ల కొందరు నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేతినిండా ఆఫర్లు ఉండటం గమనార్హం.