పాన్ ఇండియా స్టార్లుగా మారేందుకు.. పోటీ పడుతున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే?

మొన్నటి వరకు టాలీవుడ్ హీరోలు తాము నటించిన సినిమాలు కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాగా ఆడితే సరిపోతుంది అనుకునేవారు.

ఇప్పుడు మాత్రం దక్షిణాదిలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నారు.

ఇక బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా తెలుగు చిత్ర పరిశ్రమకు పాకిపోయింది స్టార్ హీరోల సినిమాలన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.

అన్ని భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి.హీరోలు కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

బాహుబలి సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిన డార్లింగ్ ప్రభాస్ ఇక ఆ తర్వాత అదే రేంజి ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించాడు అల్లు అర్జున్.ఇక ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత కూడా కథలను ఎంచుకుంటూ ఉండడం గమనార్హం.

ఇక మరోవైపు త్రిబుల్ ఆర్ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతారని సినీ పండితులు అంటున్నారు.

దీంతో త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కాకపోయినప్పటికీ ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/"/ ఎన్టీఆర్ కొరటాల శివ తో పాన్ ఇండియా లెవెల్ సినిమాలో.చరణ్ దర్శకుడు శంకర్, గౌతమ్ తిన్ననూరి ల తో చేయబోయే సినిమాలకు కూడా మల్టీ లాంగ్వేజ్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక బాక్గ్రౌండ్ వచ్చి స్టార్ హీరో రేసులో ఉన్న విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా స్టార్ డమ్ పై కన్నేశాడు.

లైగర్ మూవీ తో ఇక పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు సిద్ధమవుతున్నాడు.

రానున్న రోజుల్లో సుకుమార్ లాంటి స్టార్ దర్శకులతో పని చేసేందుకు రెడీ అయిపోయాడు విజయ్ దేవరకొండ.

సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో హిందీలో కూడా క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు లో నటిస్తున్నాడు.

"""/"/ మరోవైపు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు సినిమా కూడా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక మరో వైపు మహేష్ బాబు రాజమౌళి తో సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు.

ఇక యువ హీరో సందీప్ కిషన్ సైతం మైఖేల్ అనే సినిమా మల్టీ లాంగ్వేజ్ లో పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కుతుంది.

ఇక నాగచైతన్య లాల్ సింగ్ సర్దార్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

మరోవైపు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సైతం చత్రపతి హిందీ రీమేక్లో నటించేందుకు రెడీ అయిపోయాడు.

ఇలా టాలీవుడ్ స్టార్ లు పాన్ ఇండియా స్టార్లుగా మారేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

బిగ్‌బాస్‌ని నమ్మి పెద్ద తప్పు చేసిన సోనియా.. ఇప్పుడేదో చేస్తుందట..?