టాలీవుడ్ స్టార్ హీరోలు మిస్ చేసుకున్న 3 మంచి రీమేక్ సినిమాలు ఇవే.. ఏమైందంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు పెద్దగా క్రేజ్ లేదు కానీ ఒకప్పుడు మాత్రం రీమేక్ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు.

రీమేక్ సినిమాల హక్కుల కోసం స్టార్ హీరోలు సైతం పోటీ పడిన సందర్భాలు ఒకింత ఎక్కువగానే ఉన్నాయి.

అయితే మన టాలీవుడ్ హీరోలు 3 మంచి రీమేక్ సినిమాలను మాత్రం మిస్ చేసుకున్నారు.

గజిని,( Ghajini ) బాషా,( Basha Movie ) బెంగళూరు డేస్( Bangalore Days ) సినిమాలను తెలుగులో రీమేక్ చేసే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ హీరోలు వదులుకున్నారు.

గజిని సినిమాను పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) బాషా సినిమాను చిరంజీవి,( Chiranjeevi ) బెంగళూరు డేస్ సినిమాను నాని( Nani ) సినిమాను మిస్ చేసుకున్నారు.

ఈ ముగ్గురు హీరోలు ఈ సినిమాలను మిస్ చేసుకోవడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఈ 3 సినిమాలను టాలీవుడ్ హీరోలు రీమేక్ చేసి ఉంటే ఉంటే ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ సినిమాలలో రెండు సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు మెగా హీరోలు కావడం గమనార్హం.

వాస్తవానికి గజిని సినిమాలో నటించడానికి సూర్య ఓకే చెప్పడానికి ముందు కూడా చాలామంది ఈ సినిమాను రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది.

సూర్య( Surya ) రిస్క్ చేసి నటించడం అతని కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / టాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల వల్ల ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.

చిరంజీవి మాత్రం డేట్స్ సమస్య వల్ల బాషా సినిమాలో నటించలేదు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నేపథ్యంలో రీమేక్ సినిమాల హడావిడి లేదు.

నిర్మాతలు సైతం రీమేక్ సినిమాల రైట్స్ విషయంలో ఆశలు వదులుకున్నారు.

రీమేక్ చేయడం ఆపేయండి… హరీష్ శంకర్ కి సలహా ఇచ్చిన నేటిజన్ డైరెక్టర్ సమాధానం ఇదే?