మళ్లీ బాక్సాఫీస్‌ వెలవెల.. ఎప్పటి వరకు ఇలా?

గత నాలుగు వారాలుగా టాలీవుడ్ ( Tollywood )బాక్సాఫీస్ వద్దకి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళి పోతున్నాయి.

ఒక్క సాయి ధరం తేజ్ మరియు సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష( Virupaksha ) సినిమా మినహా ఇతర సినిమాలన్నీ కూడా వచ్చినవి వచ్చినట్లుగానే ఒకటి రెండు రోజులకే కనిపించకుండా పోతున్నాయి.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఏజెంట్ సినిమా తో పాటు మరిన్ని సినిమాలు కూడా నిరాశ పర్చాయి.

ఈ వారం ఉగ్రం( Ugram ) మరియు రామబాణం( Rambanam ) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అల్లరి నరేష్ ఉగ్రం ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

అలాగే గోపీచంద్ వేసిన రామబాణం సినిమా సరైన చోట తగల్లేదు. """/" / మొత్తానికి ఈ రెండు సినిమా లు కూడా నిరాశ పరచడంతో మళ్లీ ఎప్పటికీ తెలుగు బాక్సాఫీస్ కలకలలాడుతుంది అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వచ్చే శుక్రవారం నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా( Custody Movie ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించేనా అనేది చూడాలి.ఆ తర్వాత చిన్న సినిమా లు చాలానే వస్తున్నాయి.

అవైనా ఈ సమ్మర్ సీజర్ ని సద్వినియోగం చేసుకొని మంచి కలెక్షన్స్ ని రాబడతాయేమో చూడాలి.

పెద్ద సినిమా ల కోచం ఇంకా చాలా రోజులు ఆగాల్సిందే.ఈ లోపు చిన్న సినిమాల్లో ఏదో ఒకటైన సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మహేష్‌ బాబు.రామ్‌ చరణ్‌.

ఎన్టీఆర్‌ ఇలా దాదాపు స్టార్స్ అంతా కూడా వచ్చే ఏడాది అంటున్నారు.ప్రభాస్ మాత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బాక్సాఫీస్ కలకలలాడాలి అంటే ఆదిపురుష్ రావాల్సిందే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

27 న ఐప్యాడ్ లతో ఏపీ క్యాబినెట్ సమావేశం