లుంగీ కట్టి అదరగొట్టిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే?
TeluguStop.com
అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ నేడు రిలీజ్ కాగా లుంగీ కట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా ఉన్న సంగతి తెలిసిందే.
ఫ్యాన్స్ ముందుగా ఊహించిన విధంగానే ఈ సినిమాకు భీమ్లా నాయక్ టైటిల్ ఫైనల్ అయింది.
మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనే ఆలోచనతో టాలీవుడ్ హీరోలు లుంగీని నమ్ముకుంటున్నారు.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
పవన్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో లుంగీ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరో రామ్ చరణ్ సైతం రంగస్థలం సినిమాలో ఎక్కువ సమయం లుంగీలో కనిపించగా టాలీవుడ్ ప్రేక్షకులు చరణ్ లుక్ కు ఫిదా అయిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ తన లుక్ తో ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించారు.
సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను సినిమాలలో మహేష్ బాబు లుంగీ లుక్ లో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే.
"""/"/
పోకిరి సినిమాలో సైతం ఒక పాటలో లుంగీ కట్టి మహేష్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో లుంగీ కట్టుకుని మెప్పించారు.
ఈ సినిమాకు ముందే ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్ లేచిపోద్ది పాటలో లుంగీ కట్టి ఆ లుక్ తో బన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ మిర్చి సినిమా కొరకు పంచెకట్టులో కనిపించిన సంగతి తెలిసిందే. """/"/ ప్రభాస్ ఫిజిక్ కు ఆ లుక్ అదిరిపోయిందని అప్పట్లో కామెంట్లు వినిపించాయి.
గీతా గోవిందం సినిమాలోని ఒక పాటలో విజయ్ దేవరకొండ సైతం లుంగీ లుక్ లో కనిపించారు.
నేనే రాజు నేనే మంత్రి మూవీలో రానా, ప్రేమమ్ లో నాగ చైతన్య, అఖండలో బాలయ్య, శ్రీకారం మూవీలో శర్వానంద్, చావుకబురు చల్లగా మూవీలో కార్తికేయ, నారప్పలో వెంకటేష్, సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున పంచెకట్టులో కనిపించిన సంగతి తెలిసిందే.
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!