ఒకే ఏడాదిలో ఏకంగా రెండు సినిమాలు.. స్టార్ హీరో బాలకృష్ణకు మాత్రమే సాధ్యమా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు(Nandamuri Balakrishna) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
సంక్రాంతి పండుగ కానుకగా డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాను రిలీజ్ చేసి బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారనే సంగతి తెలిసిందే.
డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్, కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.గత 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి.
సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమా బుకింగ్స్ పరంగా అదరగొడుతోంది.అయితే ఈ ఏడాది బాలయ్య అఖండ2(Balayya Akhanda2) సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అఖండ (Akhanda)సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
బాలయ్య పారితోషికం 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
"""/" /
ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలకు సాధ్యం కావడం లేదు.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ప్రభాస్ మాత్రమే ఈ రేర్ ఫీట్ అందుకుంటున్నారు.
స్టార్ హీరో బాలయ్య మాత్రం ఒకే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
స్టార్ హీరో బాలయ్యకు ఉన్న క్రేజ్ మాత్రం మామూలు క్రేజ్ కాదనే సంగతి తెలిసిందే.
"""/" /
బాలయ్య(Balayya) ఒకప్పుడు వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
బాలయ్య డాకు మహారాజ్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.64 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య తన అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరుస్తున్నారు.
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
బాలయ్య ‘అఖండ 2’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?