ఈ స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు హీరోగా కూడా నటించాడని మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన "స్నేహ గీతం" అనే చిత్రం అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ నటీనటులు వెంకీ అట్లూరి, సందీప్ కిషన్, కృష్ణ చైతన్య, సుహాని, వెన్నెల కిషోర్, వేణుమాధవ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రంలో హీరోలుగా నటించినటువంటి సందీప్ కిషన్, కృష్ణ చైతన్య, ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోగా బాగానే రాణిస్తున్నారు.

ఈ చిత్రం హీరోగా నటించినటువంటి మరో హీరో వెంకీ అట్లూరి మాత్రం ఈ చిత్రంలో నటించిన అనంతరం దర్శకుడిగా మారాడు.

ఈ క్రమంలో మిస్టర్ మజ్ను, తొలిప్రేమ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు.అయితే ఇందులో మిస్టర్ మజ్ను చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

కానీ తొలిప్రేమ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

దీంతో ప్రస్తుతం చిత్రాలకి డైలాగ్ రైటర్ మరియు డైరెక్టర్ గా పని చేస్తూనే తన తదుపరి చిత్ర పనులను చక్కబెడుతున్నాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వెంకీ అట్లూరి తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నటువంటి రంగ్ దే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగాప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో కొంతకాలంపాటు తాత్కాలికంగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేశారు.

తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?