సినిమాల్లో అలా రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపిన సీనియర్ హీరోయిన్లు..
TeluguStop.com
సాధారణంగా హీరోలు లేదా హీరోయిన్లు కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు.మళ్లీ కొంతకాలానికి మంచి పాత్రల ద్వారా రీఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతుంటారు.
అలాంటి వారిలో కొందరు సీనియర్ హీరోయిన్లు ఉన్నారు.వీళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు.
వారు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• విజయశాంతి/h3p
విజయశాంతి( Vijayashanti ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ బ్యూటీ నేటి భారతం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్, ఇండియన్ యాక్షన్ క్వీన్ వంటి బిరుదులు తెచ్చుకుంది.
ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 190 సినిమాల్లో యాక్ట్ చేసింది.
1980 నుంచి 2006 దాకా ఏటా చాలా సినిమాల్లో నటిస్తూ వచ్చింది.తర్వాత సడన్‌గా మూవీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది.
మళ్లీ 2020లో మహేష్ బాబు యాక్షన్ కామెడీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"తో ( Sarileru Neekevvaru )కంబ్యాక్ ఇచ్చింది.
ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతిగా యాక్ట్ చేసింది.మహేష్ బాబును ఆమె దత్తత తీసుకుంటుంది.
విజయశాంతి మహేష్ తల్లిగా అద్భుతంగా నటించి దుమ్మురేపింది. """/" /
H3 Class=subheader-style• నదియా/h3p
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నదియా( Nadia ) 1984 నుంచి సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ వస్తోంది.
బజార్ రౌడీ, వింత దొంగలు వంటి సినిమాలతో తెలుగువారిని అలరించింది.1994 తర్వాత ఆమె తెలుగులో నటించలేదు.
మళ్లీ 2013లో మిర్చి( Mirchi ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది.
అందులో ప్రభాస్ తల్లిగా నటించి మెప్పించింది.నదియాకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు.
డైలాగులు కూడా బాగానే ఉన్నాయి.అమ్మాయిలనుంచి కొడుకును కాపాడే తల్లి లాగా చాలా చక్కగా నటించి ఆమె మెప్పించింది.
"""/" /
H3 Class=subheader-style• సంగీత/h3p
సంగీత( Sangeeetha ) ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి, నా ఊపిరి, బహుమతి లాంటి సినిమాల్లో యాక్ట్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ అందాల ముద్దుగుమ్మ 2010 తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.మళ్ళీ 2020లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది.
దీని తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో చాలా ప్రాధాన్యమున్న పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"""/" /
H3 Class=subheader-style• టబు/h3p
ప్రేమదేశం హీరోయిన్ టబు( Tabu )దాదాపు 12 ఏళ్ల తర్వాత అలా వైకుంఠపురములో సినిమాతో తెలుగులో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది.
టబు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా సినిమాలు చేస్తోంది.
ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?