ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ .. ఇప్పుడు సీరియల్స్ లోకి ఎంట్రీ.. ఎవరంటే?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై స్టార్ హీరోలతో కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఎంతో మంది సినీ తారలు ప్రస్తుతం వారి సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు.

ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ హీరోయిన్స్ బుల్లితెర ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఇప్పటికే ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి హీరోయిన్ రాశి స్టార్ మాలో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్నారు.

ఈ పాత్ర రాశికి ఎంతో మంచి పేరు సంపాదించిందని చెప్పవచ్చు.అదేవిధంగా అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా నటించినటు వంటి కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అదేవిధంగా శుభలగ్నం, మావిడాకులు వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ తిరిగి సినిమాలలో ప్రారంభించారు.

"""/" / ఇప్పటికీ ఆమని ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ పలు సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా ఈమె బుల్లితెరపై కూడా ముత్యమంత ముద్దు అనే సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఎంతో మంది తారలు వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకుని బుల్లితెరపై కూడా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.

మరి ఈ సినీ తారల బాటలోనే మరోక టాలీవుడ్ టాప్ హీరోయిన్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైంది.

"""/" / ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా టాలీవుడ్ టాప్ హీరోలైన నాగేశ్వరరావు ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా పలు చిత్రాలలో సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

"""/" / ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రభ ప్రస్తుతం బుల్లితెరపై కలసి ఉంటే కలదు సుఖం అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కానుంది.

ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారం కానుంది.మరి కొద్ది రోజులలో బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కావడంతో ఈ సీరియల్ రాత్రి 10 నుంచి 10:30 వరకు ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఒక ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీరియల్లో ప్రభ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

వెండితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ప్రభాస్ కొత్త సినిమాలో కీలక పాత్ర లో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరో…