సుమను ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కానీ..?

బుల్లితెరపై నంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్న సుమ వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో కూడా సుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే తాజాగా సుమ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.

ఆ వీడియోను తాను చాలాసార్లు చూశానని ఆ వీడియో అంటే తనకు ఎంతో ఇష్టమని సుమ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించారు.

అయితే ఆ వీడియోలో దూడ మూతికి చిక్కం ఉండటం వల్ల దూడను పాలు తాగకుండా చేశారంటూ కొందరు నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు.

అలా దూడ మూతికి చిక్కం కట్టడం ఆ దూడ స్వేచ్ఛను హరించడమే అని సుమకు అందులో క్రూరత్వం కనిపించడం లేదా.

? అంటూ కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు.అయితే సుమ అభిమానులు మాత్రం అలా కామెంట్లు చేసిన వాళ్లకు రివర్స్ లో కౌంటర్లు ఇచ్చారు.

దూడలు పాలు తాగిన తరువాత కొన్ని సందర్భాల్లో మట్టి తినడం చేస్తాయని దూడలు మట్టి తింటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మూతికి ఆ విధంగా కడతారని ఆమె చెప్పారు.

మూతికి చిక్కం కట్టడం దూడ స్వేచ్చను హరించడం కోసమే అని అనుకుంటే పొరబడినట్లేనని సుమ అభిమానులు చెప్పుకొచ్చారు.

సుమ షేర్ చేసిన ఈ వీడియోకు 2 లక్షలకు పైగా లైకులు రావడం గమనార్హం.

"""/"/ మరోవైపు బుల్లితెరపై వరుస షోలతో సుమ కనకాల బిజీగా ఉన్నారు.ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఛానెల్స్ లో సుమ యాంకర్ గా చేస్తున్న షోలు ప్రసారమవుతున్నాయి.

సుమ టీవీ ఛానెల్స్ లో యాంకరింగ్ చేస్తున్న షోలన్నీ మంచి టీఆర్పీ రేటింగ్ లను పొందుతుండటం గమనార్హం.

అపూర్వ దృశ్యం.. కిడ్నాపర్‌ని కౌగిలించుకుని ఏడ్చేస్తున్న పిల్లవాడు.. మ్యాటరేంటంటే.?