నిర్మాతల సమ్మెకు బింబిసార, సీతారామం సమాధానం కానుందా!

టాలీవుడ్ లో నిర్మాతల సమ్మె జరుగుతోంది.భారీ గా బడ్జెట్ పెరిగింది.

తమ వల్ల ఈ మేకింగ్ ఖర్చులు కావడం లేదు అంటూ వారు ఆందోళన చేస్తున్నారు.

ఎంత ఖర్చు చేసినా కూడా పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రానప్పుడు ఎలా సినిమాలు తీస్తాం అంటూ చాలా మంది గగ్గోలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో విడుదల అయిన సీతారామం మరియు బింబిసార సినిమా లు వారి ప్రశ్నలకు సమాధానాలు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతలు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా మంది ఇప్పటికే సినిమాల మేకింగ్‌ విషయంలో పాత పద్దతులు వాడుతున్నారు.

స్క్రిప్ట్‌ సెలక్షన్ మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి నష్టాలు రావు.

సినిమాకు ఎంత బడ్జెట్‌ అవసరం అనేది చూసుకుని సినిమా ని నిర్మించాలి.అంతే తప్ప ఇష్టానుసారంగా సినిమాలను నిర్మించడం వల్ల నష్టాలు కాకుండా మరేం వస్తాయి అంటున్నారు.

ఇప్పుడు బింబిసార సినిమా కు కళ్యాణ్ రామ్‌ 40 కోట్ల ఖర్చు పెట్టాడు.

సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయినా కూడా ఆ నలబై కోట్ల వసూళ్లు నమోదు అవుతాయా అంటే అనుమానమే.

"""/"/ఎందుకంటే కళ్యాణ్ రామ్ మార్కెట్‌ స్థాయి అది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున టాలీవుడ్‌ నిర్మాతల యొక్క ఖర్చు గురించి చర్చిస్తున్నారు.

సినిమా లు సూపర్ హిట్ అయినా కూడా వసూళ్లు నమోదు అవుతున్నా కూడా లాభాలు రావడం లేదు అంటే ఖర్చు ఎవరు చేస్తున్నారు.

ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలకు ఉంది అనేది కొందరి అభిప్రాయం.

ఈ సినిమాలు అయినా వారికి సమాధానంగా నిలుస్తాయా అనేది చూడాలి.

ధనుష్ రాయన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…