రాజమౌళిపై నిర్మాతల ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అన్ని రంగాల మాదిరిగానే సినిమా రంగంలోనూ కొన్ని నిబంధనలు, పద్దతులు, పట్టింపులు ఉంటాయి.

ఉండాలి కూడా.ఇండస్ట్రీ అన్నాక ఎంత తోపులైనా కావొచ్చు కానీ.

కొన్ని కట్టుబాట్లకు లోబడే నడుచుకోవాలి.కాదూ.

కూడదు.అంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాం ఉంటుంది.

తాజాగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి వ్యవహార శైలి కూడా పలు వివాదాలకు తావిస్తుంది.

ఆయన తీరుపై పలువురు నిర్మాతలు గుర్రుగా ఉన్నారు.ఇంతకీ ఆయనపై మిగతా నిర్మాతలకు ఎందుకు కోపం వచ్చింది? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారతీయ సినిమా పరిశ్రమ మెచ్చుకునే దర్శకుడు రాజమౌళి అనే విషయంలో ఎవరికీ ఏ డౌట్ అవసరం లేదు.

కానీ.తాను గొప్ప దర్శకుడిని.

నేను ఆడిందే ఆట.పాడిందే పాట అంటే ఎవరూ సహించరు.

నిజానికి రాజ‌మౌ సినిమా ఎప్పుడు తీస్తాడో.ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పడం కష్టం.

ఆయనకే ఈ విషయంలో క్లారిటీ ఉండదు అని చెప్పుకోవచ్చు.అయితే సినిమా ఎలాగైనా తీసుకోవచ్చు.

ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు.ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోవచ్చు.

కానీ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఓ క్లారిటీ ఉండాలి.సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయాన్ని ముందే ప్రొడ్యూస‌ర్ గిల్డ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

"""/"/ దానికి కారణం సినిమా పరిశ్రమలో సంక్రాంతి అనేది అతిపెద్ద సీజ‌న్‌.ద‌స‌రా, దీపావళి, వేసవి సీజన్లు కూడా ఉంటాయి.

అందులో భాగంగానే తన తాజా సినిమా ఆర్ ఆర్ ఆర్ ను దసరాకు రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగా ప్రకటించాడు రాజమౌళి.

అక్టోబ‌ర్ 13న సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు.కానీ ప్రస్తుతం దసరా నుంచి ఆయన చూపు సంక్రాంతి మీద పడిందట.

దీంతో నిర్మాతలకు మండిందట.ఆర్ ఆర్ ఆర్ ద‌స‌రాకు రిలీజ్ అవుతుందనే కారణంగా పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలకు అనుకున్నారు.

ప‌వ‌న్‌ భీమ్లా నాయ‌క్ జ‌న‌వ‌రి 12న‌, మ‌హేష్ స‌ర్కారువారి పాట 13న‌, ప్ర‌భాస్ రాధేశ్యామ్ 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి సంకేతాలు ఇవ్వడం పట్ల నిర్మాతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట.

ఆయన తీరు నిబంధనలు ఉల్లంఘించేలా ఉందంటున్నారట.తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజమౌళి ఏం చేస్తాడో చూడాలి.

100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?