2 సార్లు విమానం కూలిపోయిన ప్రాణాలతో బయటబడ్డ లెజెండరీ నిర్మాత రామానాయుడు..ఎంత సాహసం
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక సినిమా అనేది దృశ్య రూపకంగా మారి బయటకి రావాలి అంటే మాత్రం ఆ సినిమాకి డబ్బులు పెట్టి ముందుండి నడిపించే ఒక ప్రొడ్యూసర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే సినిమా అనేది ముందుకు నడవడం కష్టతరంగా మారుతుంది.
అలా సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ తో ఇళ్లను పొలాలను అమ్ముకొని ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా చేసి ఆ తర్వాత నష్టపోయి రోడ్డున పడ్డ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు.
ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చినా వెళ్ళిన ఒక ప్రొడ్యూసర్ మాత్రం బలంగా ఇండస్ట్రీ లో నిలబడి పోయాడు ఆయన ఎవరు అంటే డాక్టర్ డి.
రామానాయుడు గారు అని చెప్పాలి ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించి ఏ ప్రొడ్యూసర్ కి సాధ్యం కాని విధంగా ఇండియాలోనే అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానాన్ని సంపాదించారు అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా కూడా ఆయనకు పేరుంది.
మొదట్లో ఆయన తీసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తన ఇల్లు ని తాకట్టు పెట్టి చివరి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో తీసిన రాముడు భీముడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా స్థిరపడిపోయారు ఆయన దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో చాలా సినిమాలను చేశారు.
ఆయన చేసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం అనే చెప్పాలి.రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అనతికాలంలోనే వెంకటేష్ కూడా విక్టరీ వెంకటేష్ గా మారిపోయాడు వెంకటేష్ తో చేసిన చాలా సినిమాల్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామానాయుడు గారే నిర్మించారు మొదట్లో వెంకటేష్ కి సినిమాల్లో హీరోగా చేయడం ఇష్టం లేదు అమెరికాలో బిజినెస్ పెడదామని ప్లాన్ లో వెంకటేష్ ఉన్నప్పుడు రామానాయుడుగారు పట్టుబట్టి అతనికి యాక్టింగ్ నేర్పించి తెలుగు మాట్లాడడం రాయడం నేర్పించి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ నీ హీరోగా పరిచయం చేశారు.
ఆ తర్వాత వెంకటేష్ తో బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమానీ రామానాయుడు ప్రొడ్యూస్ చేశారు.
అయితే రామానాయుడుగారు ఒకసారి ఫ్లైట్ లో తిరుపతి వెళ్తున్నప్పుడు అదే ఫ్లైట్లో చిరంజీవి, అల్లు రామలింగయ్య, విజయశాంతి లాంటి వారు ఉన్నారు తిరుపతి సమీపంలోని పొలాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవడం తో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇది ఇలా ఉంటే ఇంకోసారి డి.
రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన సూరిగాడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇండియన్ మనోరమ వాళ్లు సూరి గాడు సినిమాకు అవార్డు ఇవ్వడానికి రామానాయుడు గారికి ఆహ్వానాన్ని పంపించారు దాంతో హైదరాబాద్ నుంచి డిల్లీ వెళ్దామని విమానాశ్రయానికి వెళ్లారు అయితే అక్కడ ఫ్లైట్ కొంచెం లేట్ ఉండడంతో నైట్ ఎనిమిది గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ రెండింటికి బయలుదేరింది.
"""/"/
అయితే ఆ ఫ్లైట్ వెళ్తున్న క్రమంలో ఒకసారి కుదుపునకు గురైంది దాంతో రామానాయుడుగారు మనసులో ఏదో చెడు జరగపోతున్నట్టు అనిపించింది దాంతో నిదానంగా ఆయన నిద్ర లోకి జారుకున్నారు లేచి చూస్తే ఇంకో పది నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇంకొకసారి కూడా ఫ్లైట్ కుదుపునకు గురైంది దాంతో ఫ్లైట్ వెళ్లి వేరే ప్లేస్ లో ల్యాండ్ అయింది ఫ్లైట్ లో ఉన్నవారికి ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరూ అరుస్తున్నారు ఫ్లైట్లో అటూ ఇటూ పరిగెడుతున్నాయి ఎమర్జెన్సీ డోర్ నుంచి అందరినీ బయటకు పంపిచేస్తున్నారు అలాగే రామానాయుడు గారు కూడా ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వస్తుంటే మెడలో ఉన్న బంగారు గొలుసు ఎక్కడో పడిపోయింది దాన్ని బాగా సెంటిమెంట్ గా భావించే రామానాయుడు గారు ఎందుకిలా జరిగింది ఏదైనా కీడు జరగబోతుంది ఏమో అనుకొని ఆయన ఫ్లైట్ నుంచి బయటకు దిగి పాయింట్ జేబు దగ్గర చూసుకుంటే జేబుకి పట్టుకొని ఉంది.
ఆ చైన్ ని చూసిన ఆయన చాలా సంతోషపడ్డారు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు ఆ తర్వాత కొద్ది సేపటికి ఆ ఫ్లైట్ పేలిపోవడం జరిగింది.
ఇవి రామానాయుడు గారి జీవితంలో జరిగిన రెండు ప్రమాదకరమైన సంఘటనలు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం .. అంతర్జాతీయ విద్యార్ధులకు అమెరికన్ వర్సిటీల అలర్ట్