Kona Venkat : జగన్ పాలనపై అలాంటి కామెంట్స్ చేసిన నిర్మాత కోన వెంకట్.. స్కూల్స్ చూసి షాక్?
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్( Producer Kona Venkat ) గురించి మనందరికీ తెలిసిందే.
టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కోన వెంకట్.
ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత కోన వెంకట్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( AP CM YS Jagan ) పాలనపై ప్రశంసలు కురిపించారు.
విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు.తాజాగా కోన వెంకట్ ఆంధ్రప్రదేశ్ లోని తన సొంత గ్రామానికి వెళ్లారు.
అనంతరం అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. """/"/
స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు.
నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
అంతే కాకుండా స్కూల్ వాతావరనాణ్ణి చూసి ఆశ్చర్యపోయారు.స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.
బాపట్లలోని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాల( Karlapalem Govt School )కు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
"""/"/
ఇకపోతే ఏపీ ప్రభుత్వం( AP Government ) విషయానికి వస్తే.అధికారంలో ఉన్న వైసీపీ ఏపీ ప్రభుత్వం నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది.
గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది.పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది.
ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది.ఇలా ఏపీ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.
రాజమౌళి మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో వర్కౌట్ అవుతుందా..?