భార్య మరణం వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది.. ఎమోషనల్ అయిన దిల్ రాజు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నప్పటికీ ఈతరం ప్రొడ్యూసర్లలో దిల్ రాజు నంబర్ వన్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే.

తక్కువ పెట్టుబడితో సినిమాలను నిర్మించి ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే మార్కెట్ స్ట్రాటజీలు దిల్ రాజుకు మాత్రమే బాగా తెలుసునని చెప్పవచ్చు.

ఇప్పటివరకు లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలను నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు.

శంకర్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

దిల్ రాజు భార్య అనిత 2017 సంవత్సరం మార్చి నెల 12వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2017 సంవత్సరంలో భార్య చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని దిల్ రాజు చెప్పారు.

భార్య మరణం వల్ల తాను చాలా కృంగిపోయానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తాను సినిమాలతోనే గడిపానని సినిమాలే తనను నిలబెట్టాయని దిల్ రాజు వెల్లడించారు.

కామెడీ, లవ్ ఉండే సినిమాలను తాను ఎక్కువగా ఇష్టపడతానని కాలాన్ని తాను ఎక్కువగా నమ్ముతానని దిల్ రాజు పేర్కొన్నారు.

2017 సమయంలో సినిమాల ఫలితాల విషయంలో నమ్మకంతో ఉన్నానని ఆ నమ్మకమే నిజమైందని దిల్ రాజు వెల్లడించారు.

కరోనా వల్ల సినిమాల బడ్జెట్ పెరిగిపోతుందని ఫస్ట్ వేవ్ సమయంలో భయం వేస్తే సెకండ్ వేవ్ సమయంలో అజాగ్రత్తగా ఉన్నామని థర్డ్ వేవ్ సమయంలో ఎలా జీవించాలో అర్థమైందని దిల్ రాజు అన్నారు.

ప్రస్తుతం కరోనా వచ్చినా భయపడాల్సిన పరిస్థితి లేదని దిల్ రాజు వెల్లడించారు. """/" / కేవలం వారం రోజుల్లోనే కరోనా నుంచి కోలుకుంటున్నామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

కరోనా నిర్ధారణ అయిన వాళ్లు కూడా సెట్స్ లో మాస్క్ వేసుకుని దూరంగా ఉంటే సరిపోతుందని దిల్ రాజు కామెంట్లు చేశారు.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన పలు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ..: వీహెచ్