దిల్ రాజు ఎందుకు నోరువిప్పడం లేదు.. ‘వరిసు’ ఉన్నట్టా.. లేనట్టా?
TeluguStop.com
టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మాత్రమే కాదు పంపిణీ దారుడిగా కూడా మంచి పేరు ఉంది.
అయితే ఈయన కెరీర్ లో పంపిణీ దారుడిగా ఈయన భారీ లాభాలు కూడా గడించాడు.
అయితే ఒక్కోసారి కొన్ని సినిమాల కారణంగా కొన్ని చిక్కులు కూడా ఎదుర్కున్న సందర్భాలు ఉన్నాయి.
మరి మరోసారి ఈయన చిక్కుల్లో పడ్డారు.ప్రెజెంట్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో తమిళ్ సినిమా వరిసు కూడా ఉంది.
ఇప్పుడు ఈ సినిమా ఈయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసాడు దిల్ రాజు.
ఈయన ఎప్పుడూ సంక్రాంతి కానుకగా ఒక సినిమాను అయితే పక్కాగా రిలీజ్ చేస్తాడు.
ఈయనకు ఈ సీజన్ మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.అయితే ఈసారి ఈయన రిలీజ్ చేసేబోయే సినిమా తమిళ్ సినిమా.
తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని భారీ ప్లాన్ చేసారు.ఇప్పటికే నైజాం ఏపీలో థియేటర్లను దిల్ రాజు ముందుగానే బుక్ చేసుకోవడంతో మిగతా డిస్టిబ్యూటర్స్ కు, నిర్మాతలకు నచ్చడం లేదు.
అందుకే ఈ విషయం గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ అయ్యింది.
"""/"/
తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సంక్రాంతి లాంటి సీజన్ లో తమిళ్ డబ్బింగ్ సినిమాను తీసుకు రాకూడదని ఇక్కడ కొంత మంది నిర్మాతలు భావించారు.
దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందించడంతో ఇది వివాదాస్పదంగా మారిపోయింది.డబ్ చిత్రాలను ఎదగనివ్వడం లేదని పక్క ఇండస్ట్రీల వారు చేస్తున్న కామెంట్స్ తో మరింత ముదిరిపోతోంది.
మరి దిల్ రాజు ఈ విషయంపై మాత్రం ఇంత వరకు నోరు విప్పడం లేదు.
ఇన్ని వివాదాల మధ్య ఈయన సంక్రాంతికి వారసుడు సినిమా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
ఇదేందయ్యా ఇది.. ఆ దేశంలో పారాసెటమాల్ కలిపిన ఐస్‌క్రీమ్ అమ్ముతారు..?