ఈ చిన్నప్పటి హీరోని గుర్తు పట్టారా…?
TeluguStop.com
టాలీవుడ్ లో ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకి పనిచేసి, ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కాగా నాని ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అష్టా-చమ్మా అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.
మొదట్లో అవకాశాల కోసం కొంతమేర తీవ్రంగా శ్రమించినప్పటికీ క్రమ క్రమంగా తన నటనా ప్రతిభను మెరుగు పరుచుకుని బాగానే రాణిస్తున్నాడు.
అయితే తాజాగా నానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలని ఒకసారి పరిశీలించినట్లయితే నాని చిన్నప్పుడు తన సోదరితో తీసి కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో కొందరు నాని అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.
అంతేగాక చిన్నప్పుడు నాని చాలా ముద్దు ముద్దు గా ఉన్నాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాని టక్ జగదీష్ అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో నాని సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ఫేమ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.కాగా ఇటీవలే నాని ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న "వి"అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ?