అలాంటి సినిమాల్లో నటించడం.. కేవలం సీనియర్ హీరోల కే సాధ్యమైందేమో?

సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరోతో పాటు గ్లామరస్ హీరోయిన్ ఉంటే ఆ కిక్కే వేరు ఉంటుంది అని ప్రేక్షకులే కాదు దర్శకనిర్మాతలు కూడా అనుకుంటారు.

అందుకే హీరోలు తమ సినిమాల్లో చూడ చక్కనైన హీరోయిన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

కానీ కొన్ని కొన్ని సార్లు కథ డిమాండ్ చేస్తే హీరోయిన్లు లేకుండానే నటించేందుకు సిద్ధమైపోతు ఉంటారు హీరోలు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలా హీరోయిన్లు లేకుండా వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఆ లిస్టు ఏంటో తెలుసుకుందాం.ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు గా కొనసాగుతున్న నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఇక వీరిలో ఇప్పటివరకు హీరోయిన్ లేకుండా కథ బలంగా ఉంటే సినిమా హిట్ అవుతుందన్న విషయాన్ని నిరూపించిన వారు ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ లూసిఫర్ ను గాడ్ఫాదర్ అనే టైటిల్తో రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో చిరుకు హీరోయిన్ లేదు.అంతకుముందు మేజర్, బంధాలు అనుబంధాలు సినిమాల్లో కూడా హీరోయిన్ లేకుండా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

"""/"/ ఇక బాలకృష్ణ టైటిల్ రోల్లో నటించిన అఖండ సినిమా టైటిల్ రోల్ అఖండపాత్రకి అసలు హీరోయిన్ వుండదు.

ఇక గతంలో బాలకృష్ణ వేములవాడ భీమకవి అనే మూవీలో కూడా కథానాయిక లేకుండానే నటించారు.

ఇక శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో కూడా నారదుడి పాత్రలో కథానాయిక లేకుండానే ప్రేక్షకులను పలకరించారు.

"""/"/ టాలీవుడ్లో మన్మథుడు గా గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున షిరిడి సాయి గగనం లాంటి సినిమాలో కథానాయికలు లేకుండానే ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక అంతకుముందు రాజుగారిగది2 లాంటి సినిమాల్లో కూడా నాగార్జున సరసన హీరోయిన్ లేకపోవడంగమనార్హం.

విక్టరీ వెంకటేష్ ఈనాడు సినిమాలో హీరోయిన్ లేకుండా తన నటనతో మెప్పించారు.ఇదే సినిమాలో కథానాయికడు లేకుండానే కమల్ హాసన్ కూడా నటించడం గమనార్హం.

సూపర్ స్టార్ రజినీకాంత్ పెదరాయుడు సహా మరికొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ పాత్ర లేకుండా నటించారు .

మోహన్ బాబు సైతం హీరో గా ప్రమోషన్ పొందిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ ను తీసుకోకుండానే నటించడం గమనార్హం.

ఇక సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు, రాజకీయ చదరంగం లాంటి సినిమాల్లోనూ ఎలాంటి హీరోయిన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం.

షాకింగ్: బంగారు నాలుకలున్న 13 మమ్మీలు.. ఎందుకో తెలిస్తే మతి పోవాల్సిందే..