షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా... రిలీజ్ కు నోచుకోని చిత్రాలివే ?
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పై చర్చ నడుస్తోంది.ఎప్పుడో వారి సినిమాలకు కొబ్బరికాయ కొట్టి ఇంత కాలం గడుస్తున్నా ఇప్పటికీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయని చిత్రాలు చాలానే ఉన్నాయి.
అయితే త్వరలో వారు రిలీజ్ డేట్ బెల్స్ మోగించనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది.
ప్రెజెంట్ దగ్గర్లో మన మిల్క్ బాయ్ మహేష్ బాబు చిత్రం 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12 న మన ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
ఇక ఆ తరవాత కొద్ది రోజులు యంగ్ హీరోల చిత్రాలు అలరించడానికి రెడీ అవుతున్నాయి.
ఇక ఆ నెక్స్ట్ ఏంటి.?? అంటే మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
ఎందుకంటే ప్రస్తుతం స్టార్ట్ చేసిన కొత్త ప్రాజెక్ట్ లకు కాస్త టైం పట్టేలా ఉంది.
ఇప్పటికే షూటింగ్ మొదలెట్టిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు మాత్రం ఇప్పటి వరకు విడుదల గురించి ఊసే ఎత్తలేదు.
కొందరు చెప్పిన డేట్స్ మళ్ళీ షిఫ్ట్ చేస్తారేమో అన్న సందేహాలు వినపడుతున్నాయి.అయితే రానున్న గ్యాప్ ను ఫిల్ చేసేందుకు తమ చిత్రాలతో రంగం లోకి దిగేందుకు కొందరు హీరోలు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఇంతకీ మన హీరోల అప్ కింగ్ మూవీస్ వాటి రిలీజ్ విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
మే 20 నుండి ఆగస్ట్ 12 వరకు కూడా వరుసగా యంగ్ హీరోల సినిమాలు ఉన్నాయి ఆ లిస్ట్ లో న్యాచురల్ స్టార్ నాని, అక్కినేని నాగచైతన్య, నితిన్, నిఖిల్, నాగశౌర్య, అఖిల్, గోపీచంద్ వంటి హీరోల సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇలా ఈ యంగ్ హీరోలంతా వారి వారి చిత్రాలతో వరుస పెట్టి అలరించేందుకు డేట్లు ఫిక్స్ చేసుకోగా.
ఆ తర్వాత ఆగస్ట్ 25న పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇక ఆ నెక్స్ట్ సెప్టెంబర్ 30న మాస్ మహారాజా రవితేజ రావణాసురగా రావడానికి ఫిక్స్ అయ్యారు.
"""/" /
ఇక ఆపై చిత్రాల సంగతి క్లారిటీ లేదనే చెప్పాలి.ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ 2023 సంక్రాంతికి అనుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎప్పటి నుండో మగ్గుతున్న సలార్ చిత్రం నెక్ట్స్ సమ్మర్ కే అనుకోక తప్పేలా లేదు.
మెగా హీరో రామ్ చరణ్ – కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ ల కాంబోలో రానున్న సినిమా కూడా సంక్రాంతి సంబరాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప2 సినిమా విషయానికి వస్తే ఇంకా కొబ్బరికాయ కొట్టని ఈ చిత్రం రిలీజ్ అంటే 2023 అనుకోవలసిందే.
ఇలా బిగ్ హీరోలు ఈ ఏడాది మరోసారి స్క్రీన్ పై కనిపించే అవకాశం కనిపించడం లేదు.
గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వెనక కారణం ఏంటి..?