కాంతారా రేంజ్ కాకపోయినా అదే విధంగా తెలుగు విడుదల అయి హిట్ అయినా సినిమాలు ఇవే !
TeluguStop.com
కాంతారా ఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన ఈ సినిమా పేరే వినిపిస్తుంది.
సినిమాలో కథ, కథనం, పాత్రలు చక్కగా కుదరడం లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం హిట్ అయ్యింది.
అయితే ఈ చిత్రం విడుదల అయినప్పటి నుంచి మన తెలుగు సినిమా ఎందుకు ఇలా లేదు అంటూ విమర్శించేవారు ఎక్కువయ్యారు.
తెలుగు లో సినిమా ఈ రేంజ్ లో తీసేవారు లేరా అనే కోణంలో చాల మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే కాంతారా రేంజ్ లో కాకపోయినా స్థానికత, గ్రామీణ నేపథ్యం, లోకల్ సంప్రదాయాల నేపథ్యంలో కూడా అనేక సినిమాలు వచ్చి ఘన విజయం సాధించాయి.
అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.h3 Class=subheader-stylec/o కంచరపాలెం/h3p """/" /
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అద్భుతమైన ఎమోషన్స్ ని చూపించిన సినిమా కంచెరపాలెం.
ఈ సినిమా మొత్తం కూడా ఒకే గ్రామం లో జరుగుతుంది.ఆ ఊర్లో ఉండే ప్రధాన పాత్రలు , వాటి చుట్టూ ఉండే ఎమోషన్స్ సినిమాను విజయం వైపు నడిపించాయి.
ఇక ఈ చిత్రంలో క్లైమాక్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
H3 Class=subheader-style1978 పలాస/h3p """/" /
ఈ చిత్రం కూడా చాల తక్కువ బడ్జెట్ తెరకెక్కి మంచి సినిమా అనిపించుకుంది.
కానీ ఈ సినిమాకు సరైన ప్రమోషన్ లభించకపోవడం తో పెద్దగా ఎవరు నోటిస్ చేయలేదు కానీ, ఎంతో ఎమోషనల్ సీన్స్ ఉంది ప్రేక్షకులు మెచ్చిన సినిమా పలాస.
సినిమాలోని ప్రతి సీన్ కూడా రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
H3 Class=subheader-styleమల్లేశం/h3p """/" /
తెలంగాణ కల్చర్ ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా మల్లేశం.
నేతన్న కష్టాలను చుడుతూ అద్భుతమైన ఎమోషన్స్ తో అందరిని మనసులను కట్టిపడేసింది.ఈ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణం లోకల్ గా ఉండే మన నేతన్న సమస్యలే.
సినిమా చుసిన ప్రతి ఒక్కరు సినిమాలోని అన్ని పాత్రలతో కనెక్ట్ అవుతారు.సినిమా అంత బాగా రియలిస్టిక్ గా ఉంటుంది.
H3 Class=subheader-styleరంగస్థలం/h3p """/" /
అద్భుతమైన ఎమోషన్స్ తో ఒక ఊరిలోనే జరిగే ఎలెక్షన్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా రంగస్థలం.
ఈ సినిమాలు చెవిటి హీరో గా రామ్ చరణ్ నటన అద్భుతం.ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.
ఇవే కాకుండా అనేక సినిమాలో మన తెలుగు వారి కల్చర్ ని ప్రతిబించే సినిమాలు ఉన్నాయ్ కానీ కొన్ని క్వాలిటీ పరంగా రీచ్ కాలేకపోయాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025