పెద్ద సినిమా లు టీఆర్పీ ఆశలు వదిలి వేసుకోవాల్సిందే

ఒకప్పుడు సినిమా లు కేవలం థియేటర్ల ద్వారా మాత్రమే ప్రేక్షకులు చూసేవారు.కానీ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత సినిమా లకు శాటిలైట్ రేటు భారీ గా పలికింది.

ఒకానొక సమయం లో పెద్ద హీరో ల సినిమా లకు శాటిలైట్ రేటు బడ్జెట్లో సగం వచ్చేది.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.ఒకప్పుడు శాటిలైట్ రేటింగ్ భారీగా ఉండేది.

కానీ ఇప్పుడు ఆ రేటింగ్ దారుణం గా పడి పోయింది.అందుకు కారణం ఓటిటి లో సినిమా ను చూడడమే.

ప్రేక్షకులు ఎక్కువ శాతం డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ఆయా సినిమా లను చూస్తుండడంతో ఎప్పుడో వస్తున్న శాటిలైట్ మూవీని జనాలు పెద్ద పట్టించుకోవడం లేదు.

ఉదాహరణకు బింబిసారా సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా సాధ్యమైనంత ఎక్కువ మంది థియేటర్ల ద్వారానే చూశారు.

ఆ తర్వాత ఓటీటీ ద్వారా కూడా స్ట్రీమింగ్ అయింది.థియేటర్ల ద్వారా చూడని వారు డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా చూసేశారు.

"""/"/ సాధ్యమైనంత మంది సినిమా ను చూడటం తో టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి.

అందుకే ఆ సినిమా కు రేటింగ్ ఎక్కువ గా రావడం లేదు.ఇలాగే ప్రతి సినిమా కు జరుగుతుంది.

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి కూడా ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమా లు ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ తో కూడా పెద్ద ఎత్తున వ్యూస్ దక్కించుకోవడంతో శాటిలైట్ చానల్స్ లో రేటింగ్ నమోదు చేయలేక పోతున్నాయి.

టీవీల్లో ఈ మధ్య కాలం లో ఓటీటీ లు ఎక్కువ అయ్యాయి.కనుక ఓటీటీ లో చూసేస్తున్నారు, అందుకే టీవీల్లో శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినప్పుడు సినిమా లను లైట్ తీసుకుంటున్నారు.

అందుకే ఇక నుండి పెద్ద సినిమా లు కూడా టిఆర్పి రేటింగ్ ఆశలు వదిలి పెట్టేసుకోవాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి2 మూవీలో కల్కి రోల్ లో జూనియర్ ఎన్టీఆర్.. అదే జరిగితే బాక్సాఫీస్ షేకవుతుందా?