తెలుగు లో హిట్ అయ్యిందని బాలీవుడ్ లో తీసి బొక్క బోర్లా పడ్డ దర్శకులు

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా అప‌రిచితుడు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల అయిన ఈ సినిమా ఓ రేంజిలో హిట్ అయ్యింది.

విక్ర‌మ్ చేసిన మూడు క్యారెక్ట‌ర్ అద్భుతంగా నిలిచాయి.త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాడు.

సౌత్ లో అప్ప‌ట్లో సంచ‌న‌ల విజ‌యం సాధించిన ఈ సినిమాను మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో హీరోగా ర‌ణ్ వీర్ ను ఎంపిక చేసుకున్నాడు.అప‌రిచితుడు స్థాయిలో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

శంక‌రే కాదు.గ‌తంలో చాలా మంది సౌత్ డైరెక్ట‌ర్లు త‌మ సొంత సినిమాల‌ను బాలీవుడ్ లో రీమేక్ చేశారు.

అనుకున్నంత స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయారు.ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కులు ఎవ‌రు? ఆ సినిమాలు ఏంటి? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఎస్ జే సూర్య‌/h3p """/"/ త‌న కెరీర్ లో బెస్ట్ మూవీ ఖుషి.

ఇదే సినిమాను హిందీలో ఇదే పేరుతో 2003లో రీమేక్ చేశాడు.కానీ బాలీవుడ్ లో ఈ మూవీ బోల్తా కొట్టింది.

ఇక్క‌డ విజ‌యం సాధించి అక్క‌డ ప‌రాజ‌యాన్ని మూట‌గట్టుకుంది.h3 Class=subheader-styleప్ర‌భుదేవా/h3p """/"/ ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి సంచ‌న‌ల విజ‌యం సాధించిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.

ఈ సినిమాను బాలీవుడ్ లో ర‌మ‌యా వ‌స్త‌వ‌యా పేరుతో రీమేక్ చేశారు.కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.

H3 Class=subheader-styleగౌత‌మ్ మీనన్/h3p """/"/ గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఏమాయ చేసావె సినిమా ఏక్ దివానా తా పేరుతో రీమేక్ చేశాడు.

కానీ డిజాస్ట‌ర్ అయ్యింది.h3 Class=subheader-styleరాఘ‌వ లారెన్స్/h3p """/"/ రాఘ‌వ లారెన్స్ తెలుగులో హిట్ కొట్టిన కాంచ‌న‌ సినిమాను ల‌క్ష్మీ బాంబ్ పేరుతో బాలీవుడ్ లో తీశాడు.

కానీ విజ‌యం సాధించ‌లేదు.h3 Class=subheader-styleదేవా క‌ట్ట‌/h3p """/"/ దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ ప్ర‌స్థానం.

ఈ సినిమాను బాలీవుడ్ లో సంజ‌య్ ద‌త్ హీరోగా తీశారు.అస్స‌లు సినిమా ఎప్పుడు వ‌చ్చిందో.

ఎప్పుడు పొయ్యిందో కూడా తెలియ‌దు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!