నవంబర్ మొత్తం కూడా టాలీవుడ్ లో వాయిదాల పర్వం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2013 సంవత్సరం ఆశించినంతగా కలిసి రాలేదు అనిపిస్తుంది.ఈ ఏడాది చాలా సినిమాలు విడుదల అయ్యాయి.

అయితే సక్సెస్ శాతం మాత్రం మరీ దారుణంగా ఉంది.ప్రతి సంవత్సరం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది.

కానీ ఈసారి మాత్రం అంతకు మించి తక్కువ శాతం నమోదు అయింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విడుదల అయిన సినిమా ల్లో రెండు మూడు సినిమాలు మినహా ఏ ఒక్కటి కూడా మినిమం వసూళ్లు సాధించలేదు.

"""/" / దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది లో సినిమా లు విడుదల అయితే కాలం కలిసి రావడం లేదు అనుకున్నారేమో కానీ చాలా సినిమా లను వాయిదా వేస్తున్నారు.

ముఖ్యంగా నవంబర్ లో విడుదల అవ్వాల్సిన సినిమా ల తేదీలు చాలా వరకు మారుతున్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్‌ డెవిల్ సినిమా నుంచి మొదలుకుని వైష్ణవ్ తేజ్ యొక్క ఆదికేశవ( Adikeshava ) వరకు చాలా సినిమా లను ఈ నెలలో విడుదల చేయాలని భావించారు.

"""/" / దీపావళి కానుకగా ఆ సినిమా లు విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఇప్పుడు ఆ సినిమా లను నవంబర్‌ చివరి వారంకు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

దాంతో టాలీవుడ్‌ సినిమా లకు ఏమైంది.నవంబర్‌ లో దీపావళిని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా పలు సినిమా లు వాయిదాలు పడ్డాయి.

కానీ డిసెంబర్ లో మాత్రం పెద్ద సినిమా లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెలలో పెద్దగా విడుదల లు లేవు.కానీ వచ్చే నెలలో కచ్చితంగా రెండు మూడు హిట్స్ అయినా నమోదు అవుతాయేమో చూడాలి.

దీపావళికి తెలుగు సినిమా లు లేవు కానీ డబ్బింగ్‌ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.

పసుపు దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!