సంక్రాంతి సినిమాల షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది… రిలీజ్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

డిసెంబర్ నెలలో కూడా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో కాస్త స్లో గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందట.

అంతే కాకుండా కొన్ని సన్నివేశాలను మళ్లీ మళ్లీ చిత్రీకరిస్తున్నారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

మరో వైపు సంక్రాంతి కి విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇంకా పూర్తి కాలేదు.

విశ్వాసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారం లో ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని తెలుస్తోంది.

ఈ రెండు సినిమా లు సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడం తో ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్ వారు కొందరు ఈ సినిమా లు సంక్రాంతి కి విడుదల అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ కచ్చితం గా ఈ సినిమా లు సంక్రాంతి కి వస్తాయని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.

కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదంటూ కొందరు గుసగుసలాడుతున్నారు.హడావుడిగా చివరి నిమిషం లో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తారా ఏంటీ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సినిమాలు డబ్బింగ్ అయ్యి ఇక్కడ విడుదల కాబోతున్నాయి.

వాటి పరిస్థితి ఏంటీ అనేది చూడాలి.

పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?