ఓవర్సీస్ లో మళ్ళీ పట్టు సాధిస్తున్న తెలుగు మూవీలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీ గత కొన్ని రోజులుగా వరుస సినిమాలు ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఢీలా పడింది.

గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

గత జులై లో విడుదల అయినా అన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.అయితే మన సినిమాలు ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా వసూళ్లు రాబట్టలేక పోయాయి.

ఇక ఆగష్టు కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఆగష్టు మొదటి వారంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

దుల్కర్ సల్మాన్ సీతా రామం, నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార.ఈ రెండు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

దీంతో ఆగష్టులో మన టాలీవుడ్ మంచి శుభారంభంతో స్టార్ట్ అయ్యింది.అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమాలు కుమ్మేస్తున్నాయి.

ఈ సినిమాలు యుఎస్ మార్కెట్ లో మన టాలీవుడ్ పరువును కాపాడు తున్నాయి.

సీతా రామం సినిమా మెల్లగా మొదలయ్యి మంచిగా పుంజుకుంది.ఇక యుఎస్ మార్కెట్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి టాలీవుడ్ కు బూస్ట్ ఇచ్చింది.

"""/"/ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.ఇక యుఎస్ మార్కెట్ లో ఈ సినిమా రోజురోజుకూ హైప్ పెంచుకుంటూ మరిన్ని కలెక్షన్స్ సాధిస్తుంది.

ఇక చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఈ సినిమా కూడా యుఎస్ మార్కెట్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.

"""/"/ ఇక నందమురి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మతలకు లాభాలను తెచ్చిపెట్టి వారి జేబులను నింపింది.

ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు అందుకుంటుంది.ఈ నెల వచ్చిన సినిమాల్లో నితిన్ మాచర్ల నియోజక వర్గం మినహా మిగతా సినిమాలు నిర్మాతలకు లాభాలు తేవడమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో పట్టు సాధించాయి.

అత్త పోరు పడలేకపోతున్న మలేషియన్ మహిళ.. సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే..??