కాపీ కొట్టి సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ స్టార్ హీరోలు !

ఏదైనా సినిమా విజయం సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలబడ్డ తర్వాత దాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని మరికొన్ని సినిమాలు అదే తరహా జోనర్ లో వస్తూ ఉంటాయి.

ఓకే జోనర్ లో ఎన్నో సినిమాలు రావడం పెద్ద విషయం ఏమీ కాదు.

కానీ ఒకే సినిమా కథను కాస్త అటు ఇటుగా మార్చి తేస్తేనే అసలు సమస్య.

అలా కాపీ కొట్టి తీసిన సినిమాలు విజయవంతం అయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు.

మరి అలా ఒకే రకమైన కథతో సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ ఆ స్టార్ హీరోలు ఎవరు ? వారు తీసిన సినిమాలు ఎంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleపంచాక్షరి/h3p """/" / అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి( Arundhati ) బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇదే సినిమా కథతో ఇంచుమించు అలాగే పంచాక్షరి సినిమా( Panchakshari Movie ) తీసిన అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఈ రెండు సినిమాల్లో అనుష్క నే హీరోయిన్ గా నటించడం విశేషం.h3 Class=subheader-styleఒక్క మగాడు/h3p """/" / డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ హీరోగా నటించి ఇండియా లో అతి పెద్ద విజయం అందుకున్న సినిమా భారతీయుడు.

( Bharateeyudu ) ఈ సినిమాలో కమల్ ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే ఇదే కథను బాలకృష్ణ హీరోగా ఒక్క మగాడు( Okka Magaadu ) అనే పేరు తో తెలుగు లో తీయగా అది డిజాస్టర్ అయ్యింది.

H3 Class=subheader-styleశక్తి/h3p """/" / మగధీర( Magadheera ) సినిమా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమాకు కాస్త మసాలా దట్టించి శక్తి( Shakti ) అనే పేరుతో మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తే ఇప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

H3 Class=subheader-styleపులి/h3p """/" / బాహుబలి( Baahubali ) సినిమా విడుదల అయ్యి బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అదే సినిమా కథకు కొంచం మార్పులు చేసి తమిళ్ లో హీరో విజయ్ కుమార్ పులి( Puli Movie ) అనే పేరుతో తీస్తే అది దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఓటు వేయని వాళ్లకు అలాంటి శిక్ష వేయాలి.. పరేష్ రావల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!