అన్‌సీజన్ లో రాబోతున్న సినిమాలు.. వీటిల్లో ఎన్ని సక్సెస్ అయ్యేనో!

టాలీవుడ్‌ సినిమాలకు ఫిబ్రవరి మరియు మార్చి నెలలు అన్‌ సీజన్‌ అంటారు.ఆ రెండు నెలలు కూడా పరీక్షల సీజన్‌.

పది నుండి మొదలుకుని డిగ్రీ వరకు అన్ని పరీక్షలు కూడా ఆ రెండు నెలల్లో ఉంటాయి.

కనుక సినిమాల యొక్క కలెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి అనేది చాలా మంది అభిప్రాయం.

కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఆ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు నిరూపించాయి.

పెద్ద ఎత్తున ఈ అన్‌ సీజన్ లో వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్నాయి.

"""/"/గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఈ రెండు నెలల్లో కూడా భారీ ఎత్తున సినిమాలు వస్తున్నాయి.

చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద క్యూ కడుతున్నాయి.

ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కలిపి మొత్తంగా చిన్నా పెద్ద కలిపి 20 సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి.

ఈ సంఖ్య ముందు ముందు పెరిగినా ఆశ్చర్యం లేదు.సమంత శాకుంతలం సినిమా తో పాటు అమిగోస్.

సార్.వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

దమ్కీ మరియు దసరా సినిమాలు మార్చి నెలలో రాబోతున్నాయి. """/"/ఇక చిన్న సినిమాలు వారంకు రెండు మూడు చొప్పున కంటిన్యూగా విడుదల అవ్వబోతూనే ఉన్నాయి.

ఏప్రిల్‌ నుండి పూర్తి సమ్మర్ ను స్టార్‌ హీరోలు ఆక్రమించేస్తారు.అందుకే చిన్న సినిమాలు మరియు కంటెంట్ ఓరియంటెడ్‌ సినిమాలను ఈ అన్‌ సీజన్‌ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సినిమా కంటెంట్‌ బాగుండి.పాజిటివ్‌ టాక్ వస్తే సీజన్‌ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వసూళ్లు నమోదు అవుతాయి.

ఇది గతంలో నిరూపితం అయ్యింది.ఈ రెండు నెలల్లో రాబోతున్న సినిమాల్లో ఏ సినిమాలు ఈ సీజన్ ను అన్‌ సీజన్ కాదు అని నిరూపిస్తాయో చూడాలి.

కీళ్ల నొప్పుల‌కు కార‌ణాలేంటి.. వాటి నుండి రిలీఫ్ ఎలా పొందాలి?