కథతో పాటు క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ..పెరిగిన టాలీవుడ్ రేంజ్
TeluguStop.com
గతంలో సినిమా అంటే హీరోయిజాన్ని హైలెట్ చేస్తే చాలు అనుకునే వారు దర్శకులు.
హీరోని బేస్ చేసుకుని కథ ముందుకు నడిపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
హీరోయిజం ఒక్కటే కాదు.వాళ్ల క్యారెక్టర్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
గతంలో సినిమా విడుదల అయ్యేవరకు హీరో రోల్ ఏంటనేది బయటకు తెలిసేది కాదు.
కానీ ఇప్పుడు సినిమా మొదలు కాగానే.హీరో రోల్ ఏంటో రివీల్ చేస్తున్నారు.
తాజా సినిమాలన్నీ ఇదే పద్దతిలో ముందుకు వెళ్తున్నాయి.ప్రస్తుతం హీరో చేయబోతున్న రోల్ కేంద్రంగానే కథలను మలుస్తున్నారు దర్శకులు.
అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాని మూవీ శ్యామ్ సింగ రాయ్.ఇందులో నాని డిటెక్టివ్‌గా కనిపిస్తారట.
షెర్ లాక్ హోమ్స్– సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి సినిమాల లైన్‌లో థ్రిల్లింగ్ డిటెక్టివ్ కాన్సెప్ట్ గా రూపు దిద్దుకుంటుంది.
అటుసర్కారు వారి పాటలో బ్యాంక్ మేనేజర్‌గా కనిపించనున్నారు మహేష్ బాబు.బ్యాంక్ స్కాం నేపథ్యంగా ఈ సినిమాను పొందిస్తున్నారు.
మహేష్ బ్యాంక్ మేనేజర్‌గా నటిస్తున్నారు.ఆయన సబార్డినేట్‌గా కీర్తి సురేష్ చేస్తున్నారు.
అటు మహేష్ బాబు కోసం క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రెడీ చేస్తున్నారు అనిల్ రావిపూడి.
క్రికెట్ కోచ్‌గా సూపర్ స్టార్ ను చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. """/"/
అటు చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ లో మరో క్రేజీ సినిమా రెడీ అవుతోంది.
ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ నటిస్తారనే టాక్ వినిపిస్తుంది.
ప్రవీణ్ సత్తారు సినిమాలో రా ఏజెంట్ గా నాగ్ నటిస్తున్నారు.అఖండ మూవీలో అఘోరాగా బాలయ్య నటించబోతున్నారు.
పుష్పలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు.అటు ఆచార్యలో మాజీ నక్సలైట్‌గా చిరు కనిపిస్తున్నాడు.
స్టూడెంట్ లీడర్‌గా చరణ్ చేస్తున్నాడు.విరాట పర్వం లో మావోయిస్ట్ గా రానా నటిస్తున్నాడు.
గనిలో బాక్సర్‌గా వరుణ్ తేజ్ చేస్తున్నాడు.మ్యాస్ట్రో సినిమాలో అంధుడైన కీబోర్డ్ ప్లేయర్‌గా నితిన్ యాక్ట్ చేస్తున్నాడు.
ఇవే కాదు పస్తుతం తీస్తున్నన్న సినమాల్లో క్యారెక్టర్స్ నుంచే కథ అల్లుతున్నారు దర్శకులు.
ఫ్లిప్‌కార్ట్‌కు మొట్టికాయ వేసిన కోర్టు.. మ్యాటరేంటంటే?