ఈ ఏడాది మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏంటో తెలుసా ?
TeluguStop.com
కరోనా దెబ్బకు సినిమా పరిశ్రమ అల్లకల్లోలం అయ్యింది.సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి.ఉపాధిలేక సినీ కార్మికులు నానా అవస్థలు పడ్డారు.
సినిమాలు పూర్తయినా విడుదల కాకపోవడంతో నిర్మాతలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.నెమ్మదిగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.
వరుసబెట్టి సినిమాలు విడుదల అవుతున్నాయి.షూటింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ ఆగష్టు నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతూ.మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుంది సినిమా పరిశ్రమ.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఓపెన్ అయ్యాయి.దీంతో చిన్న సినిమాలతో పాటు భారీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
అయితే మార్కెట్ మాత్రం కరోనాకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు.కరోనాకు ముందు విడుదల అయిన బాహుబలి లాంటి సినిమా తొలి రోజునే రూ.
100 కోట్లు వసూలు చేసింది.చిన్న సినిమాలు కూడా రూ.
10 కోట్ల వరకు వసూలు చేసేవి.కానీ ప్రస్తుతం పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ సినిమాలు విడుదల అయితే బాహుబలి మాదిరిగా కలెక్షన్లు రాబట్టడం కష్టం అంటున్నారు సినిమా నిపుణులు.
"""/" /
ఈ ఏడాది విడుదల అయిన సినిమాలకు సంబంధించి మొదటి రోజు కలెక్షన్లను ఓ సారి చూస్తే , పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన వకీల్ సాబ్ తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
"""/" /
ఆ తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా నిలిచింది.ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఎక్కువ వసూళ్లు చేపట్టిన సినిమాల గురించి ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
వకీల్ సాబ్ తొలిరోజు 32.34 కోట్లు సాధించిది.
అఖండ 15.39 కోట్లు, ఉప్పెన 9.
35 కోట్లు, లవ్ స్టోరీ 6.94 కోట్లు, క్రాక్ 6.
25 కోట్లు, మాస్టర్ 5.76 కోట్లు, రెడ్: 5.
47 కోట్లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 5.45 కోట్లు సాధించి టాప్ లో ఉన్నాయి.
వైరల్ వీడియో: ఈ బుల్లి ఎలుగుబంటి అల్లరి మాములుగా లేదుగా