ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న సింబా!

ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న సింబా!

వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న సింబా!

సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ ( Sampath Nandi Team Works, Raj Dasari Productions )సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ రెడ్డి( Murali Manohar Reddy ) దర్శకత్వం వహించారు.

ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న సింబా!

అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు మురళి.ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. """/" / ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి.

కానీ థియేటర్లో మాత్రం ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు.కానీ ఇలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌ లో ట్రెండ్ అవుతుంటాయి.

ఇప్పుడు తాజాగా సింబా మూవీ ( Simba Movie )టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌ అవుతూ దూసుకుపోతోంది.

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది.ప్రస్తుతం ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయిన విషయం తెలిసిందే.

"""/" / చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబా సినిమాలో చక్కగా చూపించారు.

దర్శకుడు మురళి మనోహర్ రెడ్డి మొదటి సినిమాతోనే వీక్షకులకు మంచి మెసేజ్ ని ఇచ్చారు.

ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు కూడా అదే విధంగా కొనసాగుతుండడంతో ఈ సినిమా చాలా వరకు కనెక్ట్ అవుతోంది.

అంతే కాకుండా ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తున్నప్పటికి సింబా సినిమా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.

మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ సింబా సినిమా ముందు ముందు ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

ఆడవాళ్ళ‌ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!