బాలీవుడ్ దారిలో నడుస్తున్న టాలీవుడ్.. ఆందోళనలో నిర్మాతలు
TeluguStop.com
సినిమా పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కొంటోంది.కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా కోరుకోవడం లేదు.
అక్కడ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలైనా బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాయి.
ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ హీరోలు కూడా ఇప్పుడు పది ఇరవై కోట్ల కంటే ఎక్కువ వసూలు సాధించలేక పోవడంతో బాలీవుడ్ మళ్ళీ ఎప్పటికీ పూర్వ వైభవం సాధిస్తుంది అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ ప్రేక్షకులు డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.
ఇప్పుడు అదే పద్ధతి టాలీవుడ్లో కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.గడిచిన మూడు వారాలుగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.
ఆ సినిమాలు అత్యంత దారుణమైన కలెక్షన్స్ ను నమోదు చేశాయి.గతంలో నాగ చైతన్య నటించిన సినిమా లు 10 నుండి 20 కోట్ల రూపాయలను వసూళ్లు సాధించాయి.
కానీ తాజాగా విడుదలైన థాంక్యూ సినిమా మాత్రం మరీ దారుణంగా రూ.5 కోట్లకే పరిమితమైంది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రవితేజ సినిమా పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది.
"""/" /
అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా అదే దారిలో నడిచాయి.
దాంతో బాలీవుడ్ దారిలోనే టాలీవుడ్ సినిమాలు కూడా నడుస్తున్నాయి అంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు సినిమాలను నిర్మించడం కష్టమని పదుల కోట్లు.
100ల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తే వచ్చే లాభాలు లేకపోగా భారీ నష్టాలు వస్తే సినిమాలు నిర్మించేది ఎలా అంటూ నిర్మాతలు వాపోతున్నారు.
రాబోయే రెండు వారాల్లో రాబోతున్న సినిమాలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ కి కాస్త ఊరట కలిగిస్తాయేమో చూడాలి.