అమ్మ పాత్రల్లో మాతృత్వం పండించిన వీరు నిజ జీవితంలో అమ్మ కాలేదు అంటే నమ్ముతారా..?
TeluguStop.com
తెలుగు సినిమాల్లో హీరోల అమ్మ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.ఎన్టీఆర్, ANR టైం లో బాగా పాపులర్ అయినా అమ్మ ఎవరు అంటే సూర్యకాంతం పేరు వినిపిస్తుంది.
ఎన్టీఆర్, ANR అనే తేడా లేకుండా అందరు హీరోల సినిమాల్లో అమ్మ గా, బామ్మా గా రకరకాల క్యారెక్టర్స్ చేసింది.
అయితే ఆవిడా చేసిన పాత్రలు మాత్రం జనాలకి ఇప్పటికి గుర్తుంటాయి.అలాంటి సూర్యకాంతమ్మకి సినిమాల్లోనే పిల్లలు తప్ప నిజ జీవితంలో పిల్లలు లేరు.
అయిన కూడా ఆమె ఎప్పుడు బాధపడకుండా సెట్ లో ఉన్న ఆర్టిస్ట్ లతో నాకు పిల్లలు లేకపోయినా మీరంతా నా పిల్లలేరా అని అనేదని అప్పటి ఆర్టిస్టులు చాలామంది వారి ఇంటర్వూస్ లో చెప్పేవారు.
ఈమె తర్వాత తరంలో మనకి అమ్మ అంటే నిర్మలమ్మ ఈవిడ చిరంజీవి తో సహా ఆ తరం హీరోలందరికీ అమ్మగా చేసింది.
పలనా సినిమాలో అమ్మ పాత్ర ఉంది అంటే చాలు అది నిర్మలమ్మ గారే చేయాలి అనేంత పేరు సంపాదించింది నిర్మలమ్మ అయితే చిరంజీవితో చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరు కి బామ్మాగా నటించి కామెడీ సెంటిమెంట్ అన్ని బాగా చేసి ఆడియన్స్ ని మెప్పించారు.
ఇక ఈవిడకి కూడా పిల్లలు లేరు. """/"/
వీళ్ల తర్వాత అమ్మ అంటే అది అన్నపూర్ణమ్మగారే ఆవిడా మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన,ఆ తర్వాత అక్కగా చెల్లెగా చేసారు ఆవిడ ఎన్ని పాత్రలు చేసిన ఫైనల్ గా అమ్మ క్యారెక్టర్ ఇచ్చినంత గుర్తింపు ఆవిడాకి ఏ క్యారెక్టర్ ఇవ్వలేదనే చెప్పాలి.
అలాంటి ఈ అమ్మకి కూడా పిల్లలు లేరు అని చెప్తే ఎవరు నమ్మరు.
కానీ ఇది నిజం అందుకే అన్నపూర్ణమ్మ గారు ఒక పాపని దత్తత తీసుకొని పెంచి పోషించారు.
"""/"/
ఇలాంటివారే రమాప్రభ గారు ఆమె కెరీర్ మొదట్లో రాజబాబు తో కలిసి కామెడీ క్యారెక్టర్స్ చేసేవారు.
వాటితో ఆవిడకి మంచి గుర్తింపు వచ్చింది.ఆవిడ తెలుగు సినిమాలో 3 తరాల ఆర్టిస్టులతో కలిసి నటించారు.
అప్పుడు ఆమె సినిమాలో బాగా బిజీగా ఉండేవారు.ఆవిడా శరత్ బాబుని పెళ్లి చేసుకున్నారు.
కొన్నాళ్లపాటు కలిసి ఉన్న మధ్యలో వచ్చిన గొడవలతో విడిపోదాం అనుకోని విడిపోయి బతుకుతున్నారు.
శరత్ బాబు తో విడిపోయాక కూడా ఆమె చాలా సినిమాలు చేసింది.ఆవిడకి పిల్లలు లేరు.
అయినా కూడా భర్త డైవర్స్ ఇచ్చాడు, పిల్లలు లేరని బాధపడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ తరం డైరెక్టర్స్ లో పూరి జగన్నాధ్ గారు అయన తీసిన ప్రతి సినిమాలో ఈవిడకి ఒక క్యారెక్టర్ ఇస్తూ ఉంటాడు.
పూరి మూవీస్ లో దేశముదురు లో రమాప్రభ చేసిన ఆ సన్యాసి క్యారెక్టర్ దాంట్లో వేసిన కామెడీ పంచెస్ మాత్రం చాలా బాగుంటాయి.
ఈ మధ్య ఆవిడకి సినిమాలు తగ్గిపోయాయి మునపటిలా రావట్లేదు దాంతో ఆవిడా వాళ్ళ సొంత ఊరు వెళ్లి బతుకుతున్నారు అని తెలిసింది.
అయితే ఈ విషయం తెలిసి పూరి గారు మాత్రం ఆవిడని తన సొంత తల్లిలా భావించి ఆవిడకి నెలకి ఎంతో కొంత డబ్బులు పంపిస్తున్నారట ఎందుకు పంపుతున్నవయ్యా పూరి అని రమాప్రభ గారు అడిగితే నేను మీ కొడుకులాంటోన్ని అమ్మ మీకు నా సామర్థ్యం ఉన్నన్ని రోజులు మీకు నెలకి ఇలా ఎన్నో కొన్ని డబ్బులు అకౌంట్ లో వేస్తాను అమ్మ అని చెప్పారట.
"""/"/
ఇక ఈ దోవలో చిత్ర గారు కూడా ఉన్నారు.సింగర్ చిత్ర గారి పాటలు వింటే గాని మనకు తెల్లవారదు.
చిత్ర గారు బాల సుబ్రహ్మణ్యం గారు పాట పడుతున్నారు అంటే ఆ పాట ఆల్ మోస్ట్ హిట్ అయినట్టే అయితే దురదృష్టవశాత్తు చిత్ర గారికి కూడా పిల్లలు లేరు.
ఆమె పాట ఎంత మధురంగా ఉంటుందో కదా, అలాంటి చిత్ర గారికి కూడా పిల్లలు లేరు అంటే మనకే చాలా భాదగా ఉంది.
అయినా వీళ్ళకి పిల్లలు లేరని వాళ్ళు ఎప్పుడు బాధపడరు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరోకి హీరోయిన్ కి వాళ్ళు అమ్మలా చేసారు వాళ్ళతో అమ్మ అని పిలిపించుకుంటున్నారు కాబట్టి మాతృమూర్తి కాలేకపోయారేమో కానీ అమ్మతనాన్ని మాత్రం పొందారు అనే చెప్పాలి.
అన్నపూర్ణమ్మ అయితే ఇప్పటికి అందరు నా బిడ్డలే అని అనుకుంటూ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ .. ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ