Sreeleela : తెలుగు లో బాగా బిజీ గా ఉన్న స్టార్స్ ఇద్దరే ఇద్దరు

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కొన్నాళ్లుగా మంచి రోజులు వచ్చిన సంగతి విదితమే.

అయితే ఎవరు ఎలా సినిమా ఇండస్ట్రీ ని వాడుకుంటున్నారు అనేది మాత్రమే ముఖ్యం.

తెలివి ఉన్నవాడికి సినిమా ఒక వరం లాంటిది.అందుకే తమకు ఉన్న తెలివి తేటలతో సినిమా ఇండస్ట్రీ లో పరిచయాలు పెంచుకొని రెండు చేతుల ఎడాపెడా సంపాదిస్తున్నారు.

అందులో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది ఇద్దరే ఇద్దరు.ఒకరు శ్రీలీల( Sreeleela ) అయితే మరొకరు హీరో నిఖిల్ సిద్ధార్థ్.

ఈ ఇద్దరు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా బిజీ ఆర్టిస్ట్ లు ఎంత బిజీ అంటే ఒక రోజు లో రకరకాల మూవీ షెడ్యూల్స్ లో పాల్గొంటూ తమ టైం ని గడుపుతున్నారు.

"""/" / దీంతో పాటు డబ్బు కూడా బాగానే దొరుకుతుంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.

హీరో నిఖిల్( Nikhil Siddharth ) ఒకేసారి నాలుగు ఫ్యాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీ గా ఉన్నాడు.

అతడు కార్తికేయ సీక్వెల్ తోనే ఫ్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.దాంతో ఇప్పుడు కార్తికేయ చిత్రానికి మూడో భాగం కూడా షూటింగ్ జరుపుకుంటుంది.

దాంతో పాటు స్పై , ది ఇండియన్ హౌస్, స్వయంభు వంటి నాలుగు సినిమాలో ఒకేసారి నటిస్తున్నాడు.

ఇక శ్రీలేల సైతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

ఆమె అఫీషియల్ గా 8 సినిమాల్లో నటిస్తుండగా ఇంకా రెండు సినిమాలు కూడా దాదాపు ఖరారు అయ్యాయి.

ధమాకా తర్వాత ఆదికేశవ అనే తెలుగు చిత్రంలో శ్రీ లీల నటించగా దీని షూటింగ్ అయిపొయింది.

"""/" / ఆ తర్వాత బోయపాటి రాపో, నితిన్ 32 వ సినిమాలో, భగవంత్ కేసరి అనే బాలయ్య బాబు సినిమాలోను శ్రీ లీల నటిస్తుంది.

వీటితో పాటు జూనియర్, గుంటూరు కారం, విజయ దేవరకొండ 12 వ సినిమాలోను, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh )చిత్రంలో కూడా కనిపించబోతుంది.

ఈ ఏడాదికి కేవలం రెమ్యునరేషన్స్ ద్వారా దాదాపు 20 కోట్ల ఆదాయం సంపాదించినా ఏకైక హీరోయిన్ గా శ్రీ లీల రికార్డు సృష్టించింది.

ఒకప్పుడు కాజల్, సమంత వంటి హీరోయిన్స్ మాత్రమే ఇంత బిజీ గా ఉండేవారు.

కానీ వారి స్థానంలో శ్రీ లీల చేరింది.

ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?