బిగ్ బాస్ 6 లో టాలీవుడ్ లవర్ బాయ్.. ఈసారి పక్కా?

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ కార్యక్రమం పలు భాషలలో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు వెళుతోంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో కూడా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది.

అదేవిధంగా ఒక నాన్ స్టాప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలిచారు.

ఈ విధంగా నాన్ స్టాప్ కార్యక్రమం పూర్తి కావడంతో నిర్వాహకులు బుల్లితెరపై తిరిగి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరోవైపు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని తెలుస్తుంది.అలాగే ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని ఈ కామన్ మ్యాన్ గా తెలంగాణకు చెందిన లాయర్ హాజరవుతున్నారని వార్తలు వచ్చాయి.

"""/"/ ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వడ్డే నవీన్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేయగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న హీరో తరుణ్ ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

ఈయన బిగ్ బాస్ సీజన్ 2 లోనే పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని ఈ సీజన్ లో మాత్రం ఈయన పక్క ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

మరి ఈ సీజన్ లో అయినా నిజం ఉందా లేక ఇది కూడా ఆ వాస్తవమేనా అనే విషయం తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Groom Viral Video : వీడియో వైరల్: పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. ఆస్పత్రి బెడ్ ఎక్కిన వైనం..!