ఒకటి ముద్దు రెండు వద్దు… సీక్వెన్స్ ల పేరుతో ఫాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు
TeluguStop.com
దేవర సినిమా ( Devara Movie )విడుదలైన తర్వాత చాలామందిలో ఒక రకమైన అసహనం కనిపిస్తుంది.
ఇప్పుడు సినిమా ఎలా ఉంది ? ఎవరు బాగా చేశారు? ఎవరు తప్పు చేసారు అనే విషయంలోకి వెళ్లడం లేదు కానీ దేవర సినిమా కొంతమందికి నిరుత్సాహాన్ని మిగిలిస్తే మరి కొంత మంది పర్వాలేదు అంటున్నారు.
కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది అని మాత్రం చెప్పే వారి సంఖ్య తక్కువగానే ఉంది.
ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) ఆయన సినిమా కాబట్టి చూడడానికి వెళుతున్నారు మరి కొంతమంది ఏదో ఒక సినిమా ఉంది కదా అని వెళుతున్నారు అయితే దేవర సినిమా విజయవంతం అవ్వాలని కోరుకొని అభిమాని లేడు.
"""/" /
అయితే కాసేపు సినిమా సంగతి పక్కన పెడితే ఈ చిత్రం ముందు నుంచి రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకుంటుంది.
మొదటి భాగం హిట్ అయితేనే కదా రెండో భాగం పై అంచనాలు పెరిగేది.
మరి మొదటి భాగం తుస్ అంటే రెండో పార్ట్ తీసి మాత్రం లాభమేంటి ? దానివల్ల నిర్మాతకు తిప్పలు తప్ప ఏమైనా లాభం ఉంటుందా చెప్పండి.
ప్రస్తుతం దేవర సినిమా పై అదే రకమైన చర్చలు సాగుతున్నాయి మొదటి భాగాన్ని పూర్తిగా హిట్ అనిపించుకోలేకపోవడంతో రెండో పార్ట్ ఎలా ఉండబోతుందో అని అనుమానాలు ఇప్పటికే తారక్ అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇదివరకు గతంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ బాలకృష్ణ ఇదే పొరపాటు చేశాడు ఆయన తీసిన రెండు పార్ట్స్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
"""/" /
బాహుబలి( Bahubali )లాంటి సినిమాకి వరకు ఒకటి అయింది కాబట్టి అదే సక్సెస్ ఫార్ములా అన్ని సినిమాలకు నడుస్తుంది అంటే అది పప్పులో కాలేయడమే.
అందుకే సినిమా రాసుకునేప్పుడే రెండు పార్టీలుగా రాసుకోవడం మానేసి ముందు ఒక పాట తీసి దాని ఫలితాన్ని చూసిన తర్వాత రెండవ భాగానికి వెళ్తే బాగుంటుంది అనేది సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నాడు.
పైగా ఇవే మీ చిన్న బడ్జెట్ సినిమాలు కాదు వందల కోట్ల రూపాయలను వేచిస్తూ ఇలా ఎతిగతి లేని సినిమాలను తీయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది నిర్మాతను నిండా ఉంచేయడం తప్ప.
ఇప్పటికైనా ఆ నిర్మాతలు దర్శకులు ఈరకంగా ఆలోచించడం మొదలుపెట్టి ముందు మొదటి భాగంపై పూర్తి ఫోకస్ పెట్టి పనిచేస్తే బాగుంటుంది దాని ఫలితాన్ని చూసి రెండో పార్ట్ పై చేయాలో లేదో అని ఆలోచన చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.
నాగ చైతన్య పై వెంకీ మామ సంచలన వ్యాఖ్యలు… తెలియని ఆనందం అంటూ?